MLA Adireddy Srinivasu: మూడేళ్లలో జరగాల్సిన పనులు 8 నెలల్లో పూర్తి
ABN , Publish Date - Aug 13 , 2025 | 06:03 AM
ఆంధ్రజ్యోతి’ చేపట్టిన ‘అక్షరమే అండ గా.. పరిష్కారమే అజెండాగా’ అనేది ఒక వినూత్న కార్యక్రమం. రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధిలో ని 9వ వార్డును ఎంచుకున్నారు.
‘అక్షరమే అండగా.. పరిష్కారం అజెండా’ తోనే సాధ్యం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు
రాజమహేంద్రవరం/విజయనగరం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన ‘అక్షరమే అండ గా.. పరిష్కారమే అజెండాగా’ అనేది ఒక వినూత్న కార్యక్రమం. రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధిలో ని 9వ వార్డును ఎంచుకున్నారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. దీంతో ఒక్క వార్డులో 8 నెల ల్లో రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు తదితర 32 పనులు రూ.9.69 కోట్లతో పూర్తి చేశారు. అదనంగా వార్డులో పార్కుల అభివృద్ధికి రూ.2 కోట్లతో, వాటర్ సప్లై పనులు రూ.3 కోట్లతో, ఇతర పనులు రూ.2 కోట్లతో జరుగుతున్నాయి. వార్డులోని అందరూ ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఉంది. వారి చొరవతో జరిగిన అభివృద్ధిని గుర్తు పెట్టుకోవాలి.’’ అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈ ఏడాది జనవరి 28, 29 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా స్థానిక 9 వ వార్డులో ప్రజల సమస్యలను వారి సమక్షంలోనే మునిసిపల్ కార్పొరేషన్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ఎమ్మెల్యే మాట్లాడారు. ‘‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చక్కటి ఆలోచన, బాధ్యత కలిగిన వ్యక్తి. తప్పును ధైర్యంగా ప్రశ్నించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. విలువలను నిలబెట్టడంలో రాధాకృష్ణ పోరాటం చేశారు. ఇప్పుడు సక్సెస్ మీట్ పెట్టిన ఐఎంఏ హాల్ రోడ్డు అధ్వానం గా ఉండేది. ఇప్పుడు సిమెంటు రోడ్డు వేయడంతో రూపురేఖలు మారిపోయాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎ ప్పుడూ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటుం ది.’’ అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేషన్ డీఈ శ్యామ్యూల్, ఎలక్ట్రికల్ డీఈ లోవరాజు, ‘ఆంధ్రజ్యోతి’ సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరంలో పార్కు అభివృద్ధికి 35.85 లక్షలు
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరమే అండగా, పరిష్కారమే అజెండా’ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. విజయనగరంలోని గాంధీ పార్కుకు వీఎంఆర్‌డీఏ(విశాఖ మెట్రో పాలిటిన్ రీజియన్ డెవల్‌పమెంట్ అథారిటీ) రూ.35.85 లక్ష లు కేటాయించింది. ఈ సందర్భంగా పార్కులో ‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్’ మంగళవారం విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ ఏడాది జనవరి 8న గాంధీ పార్కులో ‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పార్కులో ఉన్న కొన్ని సమస్యలను నగరపాలక సంస్థ అధికారులు అదే నెలలో పరిష్కరించగా, గాంధీపార్కు అభివృద్ధికి వీఎంఆర్‌డీఏ తాజాగా రూ35.85 లక్షలు కేటాయించింది. మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టరు అంబేడ్కర్ మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థలు ఆయా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. తాము కూడా నిధులు కేటాయిస్తామని తెలిపారు.