ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బస్ రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు.. కండెక్టర్ లేకపోయి ఉంటే..

ABN, Publish Date - May 24 , 2025 | 07:36 PM

Tamilnadu Bus Driver: బస్సులో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం కాక భయపడిపోయారు. అక్కడే ఉన్న ఓ మహిళ గుండెపోటు వచ్చిన డ్రైవర్‌ను లేపే ప్రయత్నం చేసింది. ఆయన లేవలేదు.

Tamilnadu Bus Driver

దేవుడి లీలలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మనుషుల ప్రాణాలు తీసే విషయంలో దేవుడి ఆట మామూలుగా ఉండదు. కొన్ని సార్లు చిన్న చిన్న ప్రమాదాల్లోనే మనుషుల్ని చంపేస్తుంటాడు. మరికొన్ని సార్లు పెను ప్రమాదం జరిగినా.. ఎవ్వరికీ ఏమీ కాకుండా చూసుకుంటాడు. ఇదే దేవుడి మ్యాజిక్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో బస్ రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అతడు కుప్పకూలిపోయాడు. సాధారణంగా ఆ బస్సు వెళుతున్న వేగానికి ప్రమాదం జరిగి ఉంటే చాలా మంది ప్రాణాలు పోయేవి.


కానీ, కండెక్టర్ దేవుడిలా వచ్చి అందర్నీ రక్షించాడు. అతడు ఎలా అందర్నీ రక్షించాడో తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే. ఇక, స్టోరీ లోకి వెళితే.. తమిళనాడు, దిండుగల్‌కు చెందిన ఓ బస్సు 35 మంది ప్రయాణికులతో రోడ్డుపై వెళుతూ ఉంది. బస్సు రన్నింగ్‌లో ఉండగానే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. పక్కకు వాలిపోయాడు. అక్కడే ఉన్న కండెక్టర్ వేగంగా స్పందించాడు. వెంటనే డ్రైవర్ సీటులోకి దూకి.. తన చేతులతో బ్రేకులను గట్టిగా నొక్కాడు. దీంతో బస్సు ఠక్కున ఆగిపోయింది.


బస్సులో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం కాక భయపడిపోయారు. అక్కడే ఉన్న ఓ మహిళ గుండెపోటు వచ్చిన డ్రైవర్‌ను లేపే ప్రయత్నం చేసింది. ఆయన లేవలేదు. కండెక్టర్ బస్సు ముందుకు వెళ్లదని ధ్రువీకరించుకున్న తర్వాత డ్రైవర్‌కు సాయం చేయడానికి సిద్దమయ్యాడు. అయితే, అప్పటికే ఆయన చనిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ సంఘటనపై అధికారులు స్పందించారు. బస్సులోని ప్రయాణికులెవ్వరికీ ఏమీ కాలేదని తెలిపారు.


ఇవి కూడా చదవండి

Daughter Marriage: కూతురు చేసిన పనికి ముగ్గురు కుటుంబసభ్యులు బలి..

Pawan Kalyan: గత ప్రభుత్వం ఛీత్కారాలను మర్చిపోయారా.. డిప్యూటీ సీఎం పవన్ పేషీ..

Updated Date - May 24 , 2025 | 07:36 PM