Share News

Daughter Marriage: కూతురు చేసిన పనికి ముగ్గురు కుటుంబసభ్యులు బలి..

ABN , Publish Date - May 24 , 2025 | 07:02 PM

Daughter Marriage: అర్పిత గత కొంతకాలంగా ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇంట్లో వాళ్లను కాదని ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. అర్పిత ఇళ్లు వదిలి వెళ్లిపోవటంతో మహదేవస్వామి, మంజుల, హర్షిత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు.

Daughter Marriage: కూతురు చేసిన పనికి ముగ్గురు కుటుంబసభ్యులు బలి..
Daughter Marriage

ఈ సృష్టిలో అత్యంత విలువైనది ప్రేమ. యుద్ధంలో వేల మంది ప్రాణాలు తీసే క్రూరుడైనా.. ప్రేమించిన మనిషి కోసం కన్నీళ్లు పెట్టుకోకమానడు. రాయి లాంటి మనసునైనా.. మొత్తని దూదిలా చేయగల సత్తా ప్రేమకు మాత్రమే ఉంది. అందుకే ప్రేమ కోసం చావడానికైనా.. చంపడానికైనా ప్రేమికులు సిద్దంగా ఉంటారు. ప్రేమికులకు సమాజం నుంచి కంటే కుటుంబం నుంచే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. పిల్లల భవిష్యత్తు.. కులాలు, మతాల గురించి ఆలోచించి పెద్దలు పెళ్లికి నో చెబుతూ ఉంటారు. అయితే, కొంతమంది పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు.


కొందరు అమ్మాయిలు ప్రేమించిన వాడి కోసం ఇళ్లు వదిలి పారిపోతున్నారు. కర్ణాటకకు చెందిన ఓ అమ్మాయి కూడా ప్రేమించిన వాడికోసం ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. అదే వారి కుటుంబానికి శాపంగా మారింది. కూతురు చేసిన పనిని అవమానంగా భావించి.. ముగ్గరు కుటుంబసభ్యులు ప్రాణాలు తీసుకున్నారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. మైసూరుకు చెందిన మహదేవస్వామి, మంజుల భార్యాభర్తలు. వీరికి ఇద్దరు అమ్మాయిలు అర్పిత, హర్షిత ఉన్నారు.


అర్పిత గత కొంతకాలంగా ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇంట్లో వాళ్లను కాదని ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. అర్పిత ఇళ్లు వదిలి వెళ్లిపోవటంతో మహదేవస్వామి, మంజుల, హర్షిత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. ఈ రోజు హెచ్‌డీ కోటెలోని బుదనూర్ లేక్‌లో దూకి ప్రాణాలు తీసుకున్నారు. వీరు ముగ్గురు లేక్ దగ్గరకు వెళుతుండగా కొంతమంది చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చేసరికే దారుణం జరిగిపోయింది. పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. వారు ముగ్గురు నడుముకు తాళ్లు కట్టుకుని నీటిలోకి దూకటం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: 200 మంది ఉగ్రవాదుల్ని లేపేశారు.. మహిళా పైలట్లకు బిగ్ సెల్యూట్!

Pawan Kalyan: గత ప్రభుత్వం ఛీత్కారాలను మర్చిపోయారా.. డిప్యూటీ సీఎం పవన్ పేషీ..

Updated Date - May 24 , 2025 | 07:02 PM