Liechtenstein: ఈ దేశానికి ఎయిర్ పోర్ట్ లేదు.. సొంత కరెన్సీ లేదు.. కానీ..
ABN, Publish Date - Jul 27 , 2025 | 05:59 PM
ఈ దేశంలో ఎయిర్ పోర్ట్ లేదు. సొంత కరెన్సీ సైతం లేదు. కానీ ఈ దేశం అత్యంత ధనిక దేశం. ఇలాంటి దేశంలో నేరాలు సైతం చాలా స్వల్పంగా ఉన్నాయి. జైలులో కేవలం ఏడుగురు ఖైదీలు మాత్రమే ఉన్నారు. ఇంతకీ ఆ దేశం ఎక్కడ ఉందంటే..
ప్రపంచంలో అత్యధిక సంపన్న దేశాలంటే.. అమెరికా, ఆస్ట్రేలియా, స్వీడన్, డెన్మార్క్ తదితర దేశాల గురించి మాట్లాడుకొంటాం. కానీ అత్యంత ధనిక దేశాల జాబితాలో లీచ్టెన్‌స్టెయిన్ ఉంది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న దేశాల జాబితాలో లీచ్టెన్‌స్టేయిన్ ఒకటి. అయితే ఈ దేశం గురించి తెలుసుకుంటే మాత్రం విస్తుపోయే వాస్తవాలు ఉన్నాయి. ఈ దేశం పెద్దది మాత్రమే కాదు.. ఇది అత్యంత సంపన్నమైన దేశం కూడా. అయినప్పటికీ ఈ దేశంలో విమానాశ్రయం కానీ.. సొంత కరెన్సీ కానీ లేక పోవడం గమనార్హం. ఈ దేశానికి సొంత కరెన్సీ లేకపోవడంతో.. పొరుగు దేశాల కరెన్సీనే ఈ దేశ ప్రజలు నేటికి వినియోగిస్తున్నారు.
ఇక ఈ దేశ ప్రజలు చాలా ధనవంతులు. అలాగే ఇక్కడ నేరాల సంఖ్య సైతం చాలా స్వల్పంగా నమోదవుతుంటాయి. ఈ దేశ ప్రజలు మోసం సైతం చేయక పోవడం గమనార్హాం. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న వారి సంఖ్య జస్ట్ ఏడుగురు మాత్రమే కావడం గమనించాలి. ఈ దేశంలో మొత్తం 300 మంది పోలీసులు అధికారులు మాత్రమే ఉన్నారు. దీంతో ఈ దేశం అత్యంత ధనిక దేశం మాత్రమే కాకుండా.. సురక్షితమైన దేశాల జాబితాలో ఒకటిగా రికార్డు సృష్టించింది.
ఇంతకీ లీచ్టెన్‌స్టెయిన్ ఎక్కడుందంటే..
యూరప్‌లో లీచ్టెన్‌స్టెయిన్ ఒక చిన దేశం. ఇది స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉన్న దేశం. ఇక్కడి జనాబా కేవలం 39 వేల మంది మాత్రమే. అంటే బెంగళూరు మహానగరంలోని ఒక చిన్న ప్రాంతంలోని జనాభా మాత్రమే. కానీ ఆశ్చర్యకరం ఏమిటంటే.. ఇక్కడ నమోదైన కంపెనీల సంఖ్య 70,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. తలసరి జీడీపీలో ఇది చాలా ఉన్నత స్థానంలో ఉంది. దీని తలసరి ఆదాయం ఒక్కటిన్నర లక్షల డాలర్లుకు పైగా ఉంది. ఇది అమెరికాకంటే దాదాపు రెండు రెట్లు అధికం.
ఈ దేశ ప్రధాన ఆదాయ వనరు..
ఈ దేశ ప్రధాన ఆదాయ వనరు.. పరిశ్రమలు, వ్యాపారాలు. ఈ దేశ ప్రజలు మరి ముఖ్యంగా పరిశోధన, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ దేశంలో అత్యధిక పరిశ్రమలున్నాయి. దేశ జనాభాలో సగం మంది ప్రతి రోజు ఈ దేశంలో పర్యటిస్తారు. దీని ద్వారా ఈ దేశానికి అత్యధిక ఆదాయం లభిస్తోంది. అలాగే లీచ్టెన్‌స్టెయిన్‌లో అద్భుతమైన విద్య వ్యవస్థ ఉంది. ఇది పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ఈ దేశంలో అత్యధిక ధనవంతులు ఉన్నా.. విమానాశ్రయం మాత్రం లేక పోవడం గమనార్హం. దీంతో ఈ దేశ ప్రజలు.. ఇరుగుపొరుగు దేశాలకు వెళ్లి విమానాలు ఎక్కుతుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చిటికెలో తిరుమల శ్రీవారి దర్శనం.. ఇదిగో ఇలాగా
సింగపూర్‌లో సీఎం చంద్రబాబు సమావేశానికి అనూహ్య స్పందన
For More Telugu News
Updated Date - Jul 27 , 2025 | 06:05 PM