ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ కొరియన్‌ థ్రిల్లర్‌ గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందామా..

ABN, Publish Date - Jul 13 , 2025 | 08:37 AM

‘స్క్విడ్‌ గేమ్‌’... ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్‌. డబ్బు కోసం సగటు మనిషి ఆడే నెత్తుటి ఆటను కళ్లకు కట్టిందీ సిరీస్‌. గత రెండు సీజన్‌లు సూపర్‌హిట్‌ కాగా, ఈ ఫ్రాంచైజీలో ‘స్క్విడ్‌ గేమ్‌ 3’ ఇటీవల విడుదలయ్యింది. ఈ కొరియన్‌ థ్రిల్లర్‌ గురించిన కొన్ని ఆసక్తికర విశేషాలివి...

- ప్రాణాలతో చెలగాటం!

‘స్క్విడ్‌ గేమ్‌’... ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్‌. డబ్బు కోసం సగటు మనిషి ఆడే నెత్తుటి ఆటను కళ్లకు కట్టిందీ సిరీస్‌. గత రెండు సీజన్‌లు సూపర్‌హిట్‌ కాగా, ఈ ఫ్రాంచైజీలో ‘స్క్విడ్‌ గేమ్‌ 3’ ఇటీవల విడుదలయ్యింది. ఈ కొరియన్‌ థ్రిల్లర్‌ గురించిన కొన్ని ఆసక్తికర విశేషాలివి...

- ‘స్క్విడ్‌గేమ్‌-1’

విడుదలైన ఏడాది

నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక

మంది వీక్షించిన

కొరియన్‌ డ్రామాగా రికార్డు సృష్టించింది. అంతేకాదు

10 వారాల పాటు ‘మోస్ట్‌ వాచ్డ్‌ టీవీషో’గా నిలిచింది.

- సీజన్‌ 2 ఏకంగా 92 దేశాల్లో ఏకధాటిగా మొదటి వారం రోజుల పాటు నెంబర్‌ 1 ప్లేస్‌లో ట్రెండ్‌ అయ్యింది. అత్యధిక వ్యూస్‌ అందుకున్న సిరీస్‌గా ట్రెండ్‌ సెట్‌ చేసింది. కేవలం ఐదురోజుల్లోనే 68 మిలియన్లకు పైగా వ్యూస్‌ని అందుకుంది.

- రెడ్‌లైట్‌, గ్రీన్‌లైట్‌ ఆటలో కనిపించే అమ్మాయి బొమ్మ వాస్తవానికి నిజ జీవితంలో ఉంది. దక్షిణ కొరియాలోని ‘జిన్చియోన్‌ కౌంటీ’లోని ఒక మ్యూజియంలో ఉందది. ఆ బొమ్మను ‘స్క్విడ్‌ గేమ్‌’ చిత్రీకరణ కోసం తీసుకొచ్చారు.

- సీజన్‌-1లో కనిపించే

పాకిస్థానీ అనుపమ్‌ త్రిపాఠి.

ఇతను భారతీయ నటుడు.

కొరియన్‌ స్పష్టంగా

మాట్లాడగలరు.

- దర్శకుడు డాంగ్‌ హ్యుక్‌ తాను చిన్నప్పుడు ఆడిన ఆటల ఆధారంగా ఈ కాన్సెప్ట్‌ను డిజైన్‌ చేశారు.

- ఇందులో కీలక పాత్ర పోషించిన ప్లేయర్‌ నెంబర్‌ 456 జి- హున్‌ పాత్ర నిజ జీవితంలోనిదే. దర్శకుడు డాంగ్‌ హ్యుక్‌కు తన జీవితంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ‘డ్రాగన్‌ మోటార్స్‌’లో 16 ఏళ్ల్లు పనిచేసిన ఆయన, ఇతర ఉద్యోగులతో కలిసి ధర్నా చేయటంతో సంస్థ ఉద్యోగం నుంచి తీసేసింది. దీంతో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

- పెట్టుబడిదారీ విధానంలోని వాస్తవ రూపాన్ని, దాని పర్యవసానాలను ఈ వెబ్‌సిరీస్‌ కళ్లకు కట్టినట్లు చూపింది. దక్షిణ కొరియా సమాజంలోని వాస్తవ అంతరాలను చూపించింది.

గేమ్‌లోకి వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారు చేసే ఫోన్‌ నెంబర్‌ దక్షిణ కొరియాలో నిజంగా ఉంది. ఈ సిరీస్‌ విడుదలైన తర్వాత కొంతమంది ఆ నెంబర్‌కు ఫోన్‌ చేయడం మొదలెట్టారు. అలా ఆ నెంబర్‌కు రోజుకు 4 వేలకు పైగా కాల్స్‌ వచ్చేవట. దక్షిణ కొరియా దేశ అధ్యక్ష అభ్యర్థి అయిన హుహ్‌ క్యుంగ్‌- యంగ్‌ తన ప్రచారం కోసం ఆ నంబర్‌ను కొనుగోలు చేయడానికి 100 మిలియన్‌ వోన్‌లను (సుమారు రూ.63 లక్షలు) ఆఫర్‌ చేశాడు.

- ప్లేయర్‌ నెంబర్‌ 232 ఈ సిరీస్‌కు గుర్తుగా తన ఎడమ చేతి మీద ‘స్క్విడ్‌ గేమ్‌’ టాటూను వేయించుకున్నాడు.

- ఇందులో కాంగ్‌ సే- బ్యోక్‌ పాత్ర పోషించిన జంగ్‌ హూ- యోన్‌ ఈ సిరీస్‌తోనే నటనా రంగంలోకి ప్రవేశించింది. ఆమె ఆడిషన్‌ క్లిప్‌ చూసి, రెండో ఆలోచన లేకుండా దర్శకుడు ఎంపిక చేశారు. అలా మోడల్‌ నుంచి నటిగా

మారిందామె.

- దర్శకుడు డాంగ్‌ హ్యుక్‌ ‘స్క్విడ్‌గేమ్‌’ కథ 2009లోనే రాసుకున్నాడు. అయితే అది వెబ్‌సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి పదేళ్లు పట్టింది. ఈ స్ర్కిప్ట్‌తో ఏ ప్రొడక్షన్‌ కంపెనీకి వెళ్లినా తిరస్కరణే ఎదురయ్యేది. ‘చిన్నపిల్లల ఆటను ఎవరు చూస్తారు’ అని వెక్కిరించారు.

- మొదట్లో సిరీస్‌గా కాకుండా ఫీచర్‌ ఫిల్మ్‌గా రూపొందించాలని దర్శకుడు భావించాడు. మొదటి రెండు ఎపిసోడ్స్‌ రాయడానికి ఆయనకు దాదాపు ఆరు నెలలు సమయం పట్టింది.

- డాంగ్‌ హ్యుక్‌ ‘స్క్విడ్‌గేమ్‌-1’ రాస్తున్నప్పుడు తరచూ తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారట. పళ్లు పటపటా కొరికేవాడు. దాంతో ఆయన తొమ్మిది దంతాలను కోల్పోయాడంటే ఆశ్చర్యమేస్తుంది.

- నెట్‌ఫ్లిక్స్‌ ఈ సిరీస్‌ను ‘రౌండ్‌ సిక్స్‌’ అనే పేరుతో 2019లో ప్రకటించింది. తర్వాత దాని పేరును ‘స్క్విడ్‌గేమ్‌’గా మార్చింది.

- ఈ సీరిస్‌లో చూపించే దీవి నిజంగానే ఉంది. 1970- 80 దశకంలో ‘బ్రదర్స్‌ హోమ్‌’గా పిలిచే ఈ దీవి బుసాన్‌లో ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి.

సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 13 , 2025 | 08:37 AM