సైకిల్‌పై తన పెట్‌తో 12 వేల కిలోమీటర్ల టూర్..
ABN, Publish Date - Jul 13 , 2025 | 01:26 PM
‘777 చార్లీ’ సినిమా గుర్తుందా? అందులో హీరో, తన కుక్కను బైక్‌పై కూర్చోబెట్టుకుని టూర్లు చుట్టివస్తుంటాడు. సరిగ్గా అలాంటి ప్రయాణమే చేస్తూ ఇటీవల సామాజిక మాధ్యమాల దృష్టిని ఆకర్షించాడు బిహార్‌కు చెందిన సోను. కాకపోతే ఈ కుర్రాడు సైకిల్‌పై తన పెట్‌తో కలసి ప్రయాణిస్తున్నాడు.

ట్రావెలింగ్‌ను ఇష్టపడే సోనుకు మూగజీవాలంటే అమితమైన ప్రేమ. ఓరోజు ప్రమాదంలో గాయపడిన ఓ శునకాన్ని చేరదీశాడు. దానికి ‘చార్లీ’్ల అని ముద్దుగా పేరు పెట్టాడు. సోను ఎక్కడికెళ్లినా చార్లీ అతడిని అనుసరించేది. ఈ క్రమంలో చార్లీతో కలిసి ప్రయాణాలు చేయడం ప్రారంభించాడు. అలా తన పెట్‌తో కలిసి ఇప్పటిదాకా సుమారు 12 వేల కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేశాడు.
రామేశ్వరం, కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. సైకిల్‌పై చార్లీ సౌకర్యంగా కూర్చోవడానికి ప్రత్యేకంగా సీటు డిజైన్ చేయించాడు. ప్రయాణంలో కిందపడకుండా చుట్టూ రక్షణ ఏర్పరిచాడు. సోను తన పెట్‌తో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటాడు. అవి బాగా వైరలయ్యాయి. ‘మీ మధ్య పెనవేసుకున్న ప్రేమానుబంధానికి మేమంతా ఫిదా అయ్యాం బ్రో’ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు
Read Latest Telangana News and National News
Updated Date - Jul 13 , 2025 | 01:26 PM