Snake Watching Mobile: మొబైల్ పాములను కూడా చెడగొడుతోంది.. ఈ విషసర్పం ఏం చేస్తోందో చూడండి..
ABN, Publish Date - Jun 11 , 2025 | 07:49 PM
ప్రస్తుతం మొబైల్ అందర్నీ తన స్క్రీన్ ముందు కట్టేస్తోంది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అందరూ మొబైల్‌తోనే గంటలు గంటలు గడుపుతున్నారు. సామాజిక మాధ్యమాలను చూస్తూ టైమ్ పాస్ చేసేస్తున్నారు. ఈ మొబైల్స్ మనుషులనే కాదు.. జంతువులను కూడా వశపరుచుకుంటున్నాయి.
ప్రస్తుతం మొబైల్ (Mobile) అందర్నీ తన స్క్రీన్ ముందు కట్టేస్తోంది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అందరూ మొబైల్‌తోనే గంటలు గంటలు గడుపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలను చూస్తూ టైమ్ పాస్ చేసేస్తున్నారు. ఈ మొబైల్స్ మనుషులనే కాదు.. జంతువులను కూడా వశపరుచుకుంటున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ పాము (Snake) మొబైల్ చూస్తూ తనను తాను మర్చిపోయింది. (Snake Watching Mobile)
raj.yaduvansi.961 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఆరుబయట ఓ గోనెసంచిపై ఓ మొబైల్ ఉంది. ఆ మొబైల్‌లో పవన్ సింగ్ భోజ్‌పురి పాట బాబుయాన్ ప్లే అవుతోంది. అక్కడకు వచ్చిన పాము పడగ ఎత్తి మరీ ఆ విడియోను చూస్తూ ఉండిపోయింది. అది భోజ్‌పురి పాట వీడియోను చాలా జాగ్రత్తగా చూస్తోంది. ఈ సమయంలో, వెనుక నిలబడి ఉన్న ఒక వ్యక్తి ఆ ఘటనను చిత్రీకరించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 60 లక్షల మందికి పైగా వీక్షించారు. 2.2లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈ పాము కూడా పవన్ సింగ్ అభిమాని అయ్యుంటుందని ఒకరు కామెంట్ చేశారు. మొబైల్స్ పాములను కూడా చెడగొడుతున్నాయని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఆ కొంగకు ఎంత ధైర్యం.. పులులతో పోరు.. చివరకు దాని పరిస్థితి ఏమైందంటే..
Piggy Bank: అదృష్టం ఇలా కూడా వరిస్తుందా.. బురదలో దొరికిన ఓ వస్తువు అతడిని కోటీశ్వరుడిని చేసింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 11 , 2025 | 07:49 PM