Operation Blue Star: రాహుల్ గాంధీకి మతి పోయే ప్రశ్న వేసిన సిక్కు యువకుడు
ABN, Publish Date - May 04 , 2025 | 05:48 PM
Operation Blue Star: ఆపరేషన్ బ్లూ స్టార్‌కు సంబంధించి రాహుల్ గాంధీకి ఓ షాకింగ్ ప్రశ్న ఎదురైంది. కొద్దిరోజుల క్రితం రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటించారు. బ్రౌన్ యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ సిక్కు వ్యక్తి రాహుల్‌కు ఓ ప్రశ్న వేశాడు.
గోల్డెన్ టెంపుల్‌లో దాక్కున్న ఖలిస్తానీ మిలిటెంట్లను బయటకు తీసుకురావడానికి 1984లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్‌ను చేపట్టింది. ఇందిరా గాంధీ ఆదేశం మేరకు ఇండియన్ ఆర్మీ.. దాదాపు 10 రోజుల పాటు ఆపరేషన్ బ్లూ స్టార్ కొనసాగించింది. ఈ ఆపరేషన్ కారణంగా.. సాధారణ జనంతో పాటు ఆర్మీ జవాన్లు కలిపి 400 మందికి పైగా ప్రాణాలు పోయాయి. ఇంతకు మించి ఎక్కువ మందే చనిపోయారని సిక్కు వర్గాలు చెబుతున్నాయి. సంఘటన జరిగి 40 ఏళ్లు అయినా సిక్కులు మాత్రం దాన్ని మర్చిపోలేకపోతున్నారు. తాజాగా, ఆపరేషన్ బ్లూ స్టార్‌కు సంబంధించి రాహుల్ గాంధీకి ఓ షాకింగ్ ప్రశ్న ఎదురైంది.
కొద్దిరోజుల క్రితం రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటించారు. బ్రౌన్ యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ సిక్కు వ్యక్తి రాహుల్‌కు ఓ ప్రశ్న వేశారు. ‘ కొద్దిరోజుల క్రితం భారత్, విదేశాల్లో ఉన్న సిక్కుల గురించి మీరు ఓ ట్వీట్ పెట్టారు. బీజేపీ ప్రభుత్వంలో సిక్కులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సిక్కులకు స్వేచ్ఛ లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ సిక్కుల విషయంలో పరిపక్వత లేకుండా ప్రవర్తించింది. వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించింది. మీరు కూడా వీటిని కొనసాగించాలనుకుంటున్నారా?’అని ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నతో రాహుల్ షాక్ అయ్యారు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని.. ‘ నేను కాంగ్రెస్ పార్టీలో లేనపుడు ఈ తప్పులన్నీ జరిగాయి. అయినా కూడా నేను సంతోషంగా.. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులన్నిటికి బాధ్యత వహిస్తాను’ అని స్పష్టం చేశారు. సిక్కు వ్యక్తి అడిగిన ప్రశ్న తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు వీడియోపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆ వ్యక్తి ప్రశ్నను తప్పుబడుతున్నారు. మరికొంతమంది మంచి ప్రశ్న అడిగావంటూ ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Class 10 Exam: టెన్త్ ఫెయిల్ అయిన కొడుకు.. ఘనంగా సెలెబ్రేట్ చేసిన తల్లిదండ్రులు
Viral Video: వస్తువులు తిరిగి తీసుకోలేదని 15 ఏళ్ల బాలిక దారుణం..
Updated Date - May 04 , 2025 | 06:30 PM