Share News

Viral Video: వస్తువులు తిరిగి తీసుకోలేదని 15 ఏళ్ల బాలిక దారుణం..

ABN , Publish Date - May 04 , 2025 | 04:18 PM

Viral Video: బాధితుడి పక్కనే ఉన్న ఓ అమ్మాయి ఠక్కున బాలికను పట్టుకుంది. బాధితుడు కూడా ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ముందుకెళ్లాడు. దీంతో రక్తం ఫ్లోర్ మొత్తం పారింది. మొత్తానికి బాలికను పట్టుకున్నారు. బాధితుడు వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు.

Viral Video: వస్తువులు తిరిగి తీసుకోలేదని 15 ఏళ్ల బాలిక దారుణం..
Viral Video

ఆ బాలిక వయసు 15 సంవత్సరాలు. ఆ వయసులో తప్పు చేయాలంటే ఎవరికైనా బెరుకు, భయం ఉంటుంది. ఆ బాలిక మాత్రం పసితనపు ఛాయలు ఏమీ లేనట్లు ప్రవర్తించింది. ఏకంగా ఓ మనిషి రక్తం కళ్ల చూసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హపుర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, హపుర్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక తరచుగా స్థానికంగా ఉండే ఓ షాపుకు వెళుతూ ఉండేది. అక్కడ వస్తువులు కొంటూ ఉండేది. వాటిని కొన్ని రోజులు వాడుకున్న తర్వాత మళ్లీ షాపుకు తీసుకువచ్చేది.


ఆ వస్తువుల్ని తిరిగి ఇచ్చేది. ఇలా తరచుగా చేస్తూ ఉంది. శనివారం కూడా ఓ వస్తువు తెచ్చి, వెనక్కు తీసుకోమంది. ఇందుకు షాపు యజమాని ఒప్పుకోలేదు. దీంతో బాలిక కోపం కట్టలు తెంచుకుంది. అక్కడున్న వారందరినీ బూతులు తిట్టింది. ఈ నేపథ్యంలోనే అక్కడినుంచి వెళ్లిపోతూ దారుణానికి తెగబడింది. వెళుతూ.. వెళుతూ.. అక్కడే ఫోన్ వాడుతూ ఉన్న వ్యక్తిపై కత్తితో దాడి చేసింది. బ్లేడులాంటి పదునైన సాధనంతో సక్‌మని చెయ్యికోసేసింది. రక్తం బొటబొటా కారసాగింది. దీంతో అతడితో పాటు అక్కడి వాళ్లందరూ షాక్ అయ్యారు.


అతడ్ని కోసి, బాలిక పరుగులు తీసింది. బాధితుడి పక్కనే ఉన్న ఓ అమ్మాయి ఠక్కున బాలికను పట్టుకుంది. బాధితుడు కూడా ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ముందుకెళ్లాడు. దీంతో రక్తం ఫ్లోర్ మొత్తం పారింది. మొత్తానికి బాలికను పట్టుకున్నారు. బాధితుడు వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. బాధితుడి కుటుంబసభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ స్టోరీలో ట్విస్ట్ ఉంది. ఆ బాలిక మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం చికిత్స కూడా తీసుకుంటోందట.


ఇవి కూడా చదవండి

Karnataka News: తనకంటే రెండేళ్లు పెద్దదైన అమ్మాయితో ప్రేమ.. ఊహించని దారుణం..

Viral Video: పొట్టు పొట్టు కొట్టుకున్న లేడీ ప్రిన్సిపల్, లైబ్రరియన్

Updated Date - May 04 , 2025 | 04:21 PM