SBI Manager Harassment: మహిళా ఉద్యోగిని అసభ్యంగా టచ్ చేస్తున్న బాస్.. ఎస్బీఐ మేనేజర్ తీరు చూస్తే..
ABN, Publish Date - Jul 07 , 2025 | 11:15 AM
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఉనా ఎస్బీఐ బ్రాంచ్ సర్వీస్ మేనేజర్. పేరు మణీందర్ సింగ్. అతడి పక్కనే ఓ మహిళ కూర్చుని పని చేస్తోంది. ఆ సమయంలో అతడు ఆమెను ఉద్యోగ సంబంధ వివరాలు అడుగుతూ టచ్ చేస్తున్నాడు.
అతడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉన్నతోద్యోగి.. వయసు కూడా ఎక్కువే. అయితే అతడి ప్రవర్తన మాత్రం అత్యంత నీచం. మహిళలను తాకడానికి అతడు చేసే ప్రయత్నాలు చూస్తే ఏవగింపు కలగక మానదు. బాధితురాలు స్వయంగా ఆ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. హిమాచల్ ప్రదేశ్ (HimachalPradesh)లోని ఉనా ఎస్బీఐ బ్రాంచ్ (Una SBI Branch)లో ఈ ఘటన జరిగింది. మహిళా ఉద్యోగితో మాట్లాడుతూ అతడు చేస్తున్న చేష్టలు చాలా మందికి ఆగ్రహం కలిగిస్తున్నాయి (SBI Manager Harassment).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఉనా ఎస్బీఐ బ్రాంచ్ సర్వీస్ మేనేజర్. పేరు మణీందర్ సింగ్. అతడి పక్కనే ఓ మహిళ కూర్చుని పని చేస్తోంది. ఆ సమయంలో అతడు ఆమెను ఉద్యోగ సంబంధ వివరాలు అడుగుతూ టచ్ చేస్తున్నాడు. ఆమె అసౌకర్యంగా ఫీలవుతున్నప్పటికీ అతడు అడుగుతున్న వివరాలు చెబుతోంది. టైప్ చేసిన తర్వాత, సర్వీస్ మేనేజర్ ఆమెను మళ్లీ తాకాడు. వీడియో జరిగిన దాదాపు 40 సెకన్ల తర్వాత, ఆ మహిళ కెమెరాతో బయటకు వచ్చింది.
'అతడు నన్ను ఎలా తాకుతున్నాడో చూశారా. అతనికి అస్సలు సంస్కారం లేదు. నేను అతని దగ్గర కూర్చోలేను. అతను నా శరీరమంతా తాకుతూనే ఉంటాడు` అని ఆ వీడియోను చిత్రీకరించిన బాధిత మహిళ పేర్కొంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కాగా, సదరు సర్వీస్ మేనేజర్ గతంలో ఇద్దరు మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించాడని, శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. మణిందర్‌పై పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు సాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఏసీ కంపెనీలు భయపడాల్సిందే.. ఈ కూలర్ ముందు ఏసీలు కూడా పనికి రావట..
ఈ ఫోటోలో Nల మధ్యలో కొన్ని Mలు కూడా ఉన్నాయి.. ఎన్ని ఉన్నాయో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 07 , 2025 | 01:06 PM