ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పెళ్లికొచ్చిన అనుకోని అతిథి.. షాక్ అయిన జనం..

ABN, Publish Date - May 28 , 2025 | 05:41 PM

Rhino Walks Into Wedding Venue: ఆహ్వానం లేని అతిథిలా ఓ ఖడ్గం మృగం పెళ్లి జరిగే చోటుకు వచ్చింది. గేటు దాటుకుని నేరుగా లోపలికి వెళ్లింది. దాన్ని చూసి అక్కడి జనం భయపడిపోయారు. కొంతమంది భయంతో దూరంగా పరుగులు తీశారు.

Rhino Walks Into Wedding Venue

పెళ్లి జరుగుతోందంటే చాలు.. అహ్వానం ఉన్న వారితో పాటు లేని వాళ్లు కూడా వస్తుంటారు. గుట్టుచప్పుడు కాకుండా భోజనాలు చేసి పోతూ ఉంటారు. ఇలాంటి వారితో పెద్ద సమస్య లేదు. కానీ, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో పెళ్లికి ఓ అనుకోని అతిథి వచ్చింది. ఆ అతిథిని చూసి పెళ్లి జనం షాక్‌తో పాటు షేక్ కూడా అయ్యారు. భయంతో పరుగులు తీశారు. పెళ్లి జనాల్ని భయపెట్టిన ఆ అనుకోని అతిథి ఎవరో కాదు.. ఓ వైల్డ్ రైనోసారస్(ఖడ్గమృగం). ఇంతకీ సంగతేంటంటే..


కొద్దిరోజుల క్రితం నేపాల్, చిత్వాన్‌లోని సౌరాహాలో ఓ పెళ్లి జరిగింది. రాత్రి పూట ఆ పెళ్లి జరిగింది. పెళ్లి జనం సందడితో ఆ ప్రాంతం మొత్తం కలకలలాడుతోంది. ఇలాంటి టైంలో ఆహ్వానం లేని అతిథిలా ఓ ఖడ్గం మృగం అక్కడికి వచ్చింది. గేటు దాటుకుని నేరుగా లోపలికి వెళ్లింది. దాన్ని చూసి అక్కడి జనం భయపడిపోయారు. కొంతమంది భయంతో దూరంగా పరుగులు తీశారు. మరికొంతమంది వీడియోలు తీయటం మొదలెట్టారు. ఆ జనాలను చూసి అది కూడా భయపడినట్లు ఉంది.


జనం ఉన్న వైపు కాకుండా మరో వైపున వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ‘గాగ్స్ నేపాల్’ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విడుదల అయింది. ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. పెద్ద ఎత్తున లైకులు కొడుతున్నారు. కామెంట్లు పెడుతున్నారు. ‘ గేటు దగ్గర స్వాగతం అని రాసి ఉంది. అందుకే అది పెళ్లికి వచ్చింది’.. ‘ అంత పెద్ద మనిషి పెళ్లికి వస్తే.. స్వాగతం కూడా పలకరా’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఆపరేషన్ సిందూర్.. ఈ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..

Updated Date - May 28 , 2025 | 06:38 PM