ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cat Hijacks Plane : మ్యావ్ మ్యావ్ అంటూ విమానాన్ని హైజాక్ చేసి.. అందరినీ భయపెట్టిన పిల్లి.. ఎక్కడో తెలుసా..

ABN, Publish Date - Feb 14 , 2025 | 02:39 PM

Cat Hijacks Plane : విమాన హైజాక్ సంఘటనల గురించి మీరు అనేక వార్తలు విని ఉంటారు. అలాంటి ఘటనలు తల్చుకుంటేనే భయంతో వణికిపోతారు. షాక్‌కు గురవుతారు. అయితే, యూరప్‌లో జరిగిన ఈ విమాన హైజాక్ కథ వింటే మాత్రం మీరు అస్సలు నవ్వును ఆపుకోలేరు.

Cat Hijacks Flight in Germany

Cat Hijacks Plane Viral : ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేయడం గురించి అనేక వార్తలు వినే ఉంటారు. అలాంటి పరిస్థితిలో చిక్కుకున్నవారి సంగతి చెప్పనవసరం లేదు. ప్రాణభయంతో బిక్కచచ్చిపోతారు. భయంతో వణికిపోయి నోట మాట రాదు. ఇలాంటి హైజాక్ ఘటనల కథలు విన్నవారూ అంతే. అయితే, యూరప్‌లో జరిగిన హైజాక్ కథ మాత్రం దీనికి పూర్తి భిన్నం. ఇది విన్న తర్వాత ఎవరైనా సరే పడి పడీ నవ్వుతారు. ఎందుకంటే, ఇక్కడ విమానాన్ని హైజాక్ చేసింది ఓ పిల్లి మరి, వినటానికి వింతగా అనిపిస్తున్నా ఇదే నిజమండి బాబోయ్.. మ్యావ్ మ్యావ్ అంటూ పెద్ద బోయింగ్ విమానాన్నే హైజాక్ చేసింది ఓ క్యూట్ కిట్టీ..


48 గంటలు హైజాక్ చేసి భయపెట్టిన పిల్లి..

పిల్లి ఒంటరిగా విమానం ఎక్కడమేమిటి.. తర్వాత ప్లేన్ హైజాక్ చేయడమేంటి అని మీకు అనుమానం రావచ్చు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. వీధిలో నివసించే బుజ్జి క్యాట్ సరాసరి గత వారం రోమ్ నుండి జర్మనీకి వెళ్లే బోయింగ్ 737 ఎక్కేయడమే కాదు. మ్యావ్ మ్యావ్ అంటూ హైజాక్ చేసేసింది. దాదాపు 48 గంటల పాటు హైజాక్ చేసి విమాన సిబ్బందికి, ప్రయాణీకులకు చెమటలు పట్టించింది.


48 గంటలు హైజాక్ చేసి..

ఇటలీ రాజధాని రోమ్ నుంచి జర్మనీకి బోయింగ్ 737 విమానం బయలు దేరడానికి సిద్దమైంది. విమానం టేక్ ఆఫ్‌కు ముందు సిబ్బంది ఫైనల్ చెక్ అప్ చేస్తున్నారు. ఈ చెకింగ్ లోనే మ్యావ్...మ్యావ్ అంటూ శబ్దం వినపడింది. ఉలిక్కిపడిన సిబ్బంది ఆ శబ్దం ఎక్కడ నుంచి వస్తుదో అని ఆరా తీశారు. విమానంలోని ఎలక్ట్రికల్ వైర్లల్లో ఒక నల్ల పిల్లి నక్కి కనిపించింది. ఆ పిల్లిని బయటకు తీసి వెంటనే విమానం టేక్ ఆఫ్ చేయాలని అనుకున్నారు. కానీ పిల్లి సిబ్బందిని ఓ ఆటాడించింది. ఒక వైపు ఎలక్ట్రికల్ వైర్లు తొలగిస్తే మరో వైపుకు పరుగులు తీస్తూ వారిని ముప్పుతిప్పలు పెట్టింది. ఎలాగో నానా తంటాలు పడి పిల్లి డోర్ దగ్గరకు చేరగానే డోర్‌ను ఓపెన్ చేశారు. తర్వత పిల్లి ఎంచక్కా బయటకు వచ్చి స్టెప్స్ మీదుగా కిందకు దిగి వెళ్ళిపోయింది. కానీ, వైర్లు సరిచేసేసరికే విమాన సిబ్బందికి 2 రోజులు పట్టింది. ఇంతకు పిల్లి విమానంలోకి ఎలా వచ్చింది అంటే.. ఎవరైనా ప్రయాణీకుడు తీసుకొచ్చి ఉండొచ్చని అంతా ఊహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Lorry Journey Video: అవసరం ఏపనైనా చేయిస్తుందంటే ఇదేనేమో.. లారీ వెనుక వీళ్ల నిర్వాకం చూడండి..

Whale Viral Video: మృత్యువు నోరు తెరవడమంటే ఇదేనేమో.. బోటును మింగిన తిమింగళం.. చివర్లో షాకింగ్ ట్విస్ట్..

Viral: రూ.7కోట్ల జీతంతో భర్తకు ప్రమోషన్.. విడాకులు ఇస్తున్నానంటూ భార్య షాక్.. కారణమేంటో తెలిస్తే..

మరిన్ని ప్రత్యేక, తెలుగు వార్తల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 14 , 2025 | 02:39 PM