Share News

Lorry Journey Video: అవసరం ఏపనైనా చేయిస్తుందంటే ఇదేనేమో.. లారీ వెనుక వీళ్ల నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:33 PM

రద్దీగా ఉన్న హైవే మార్గంలో రాత్రి వేళ ఓ ట్యాంకర్ లారీని చూసి అంతా షాక్ అయ్యారు. ట్యాంకర్ వెనుక వైపు ఇద్దరు యువకులు నిలబడి ఉన్నారు. ఓ వ్యక్తి వెనుక వైపు ఉన్న ఇనుప కడ్డీపై నిలబడగా.. మరో వ్యక్తి..

Lorry Journey Video: అవసరం ఏపనైనా చేయిస్తుందంటే ఇదేనేమో.. లారీ వెనుక వీళ్ల నిర్వాకం చూడండి..

త్వరగా గమ్యస్థానం చేరాలనే కంగారులో కొందరు ప్రాణాలకు తెగించి ప్రయాణం చేస్తుంటారు. రైలు, బస్సుల్లో వేలాడుతూ ప్రయాణం చేసేవారిని చూస్తుంటా. అలాగే కొందరు రైలు, బస్సు పైన కూర్చుని కూడా ప్రయాణం చేస్తుంటారు. ఇంకొందరు బస్సు వెనుక వైపు లగేజీ ర్యాక్‌లో కూర్చుని ప్రయాణం చేయడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యువకులు లారీ వెనుక వైపు వేలాడుతూ వెళ్లడం చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న హైవే మార్గంలో రాత్రి వేళ ఓ ట్యాంకర్ లారీని చూసి అంతా షాక్ అయ్యారు. ట్యాంకర్ వెనుక వైపు ఇద్దరు యువకులు నిలబడి ఉన్నారు. ఓ వ్యక్తి వెనుక వైపు ఉన్న (Young men standing at back of Tanker Lorry) ఇనుప కడ్డీపై నిలబడగా.. మరో వ్యక్తి అక్కడే తాపీగా కూర్చుని మరీ ప్రయాణం సాగిస్తున్నారు.

Viral Video: వామ్మో..! ఈమేంటీ ఇలా చేసిందీ.. రీల్స్ కోసం కొడుకును ఏం చేస్తుందో చూడండి..


లారీ ఎంతో వేగంగా వెళ్తున్నా కూడా వారిలో ఏమాత్రం భయం కనిపించలేదు. ఈ క్రమంలో ఏమాత్రం అదుపు తప్పినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. లారీ వెనుక మరో వాహనంలో వెళ్తున్న వారు ఈ లారీని చూసి షాక్ అయ్యార. వెంటనే ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Whale Viral Video: మృత్యువు నోరు తెరవడమంటే ఇదేనేమో.. బోటును మింగిన తిమింగళం.. చివర్లో షాకింగ్ ట్విస్ట్..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఇలా ప్రయాణం చేయడం ఎంతో ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘కారులో వెళ్తున్న వారు వీడియో తీయకుండా.. వారికి సాయం చేయొచ్చుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20వేలకు పైగా లైక్‌లు, 4.43 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కళ్యాణ మంటపంలోకి చొరబడిన చిరుత.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Updated Date - Feb 14 , 2025 | 01:33 PM