ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: వామ్మో.. ఎంతకు తెగించారు.. కంటైనర్‌ లారీని పరీక్షించగా దిమ్మ తిరిగే సీన్..

ABN, Publish Date - Jan 21 , 2025 | 01:56 PM

ఓ కంటైనర్ లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. లారీని ఆపి తనిఖీ చేశారు. లోపల చూడగా దిమ్మతిరిగే సీన్ కనిపించింది. కంటైనర్‌లో లగేజీకి బదులుగా ..

రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి వివిధ రకాల సరుకులను అక్రమంగా తరలించేందుకు నేరస్థులు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు తెలివితేటలు చూస్తే.. ప్రజలతో పాటూ పోలీసులు కూడా ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇలాంటి విచిత్ర నేరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఏపీలోని అనకాపల్లిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కంటైనర్ లారీపై అనుమానం వచ్చిన పోలీసులు పరీక్షించారు. చివరకు అందులో ఉన్న సరుకును చూసి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


ఏపీలోని అనకాపల్లి జిల్లా (AP Anakapalli) నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఓ కంటైనర్ లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. లారీని ఆపి తనిఖీ చేశారు. లోపల చూడగా దిమ్మతిరిగే సీన్ కనిపించింది. కంటైనర్‌లో లగేజీకి బదులుగా గోమాంసాన్ని చూసి పోలీసులంతా ఒక్కసారిగ షాక్ అయ్యారు.


ఈ మాంసాన్ని కోల్‌కతా నుంచి చెన్నై తరలిస్తున్నట్లుగా విచారణలో తెలిసింది. కంటైనర్ లారీని సీజ్ చేసిన నక్కపల్లి పోలీసులు.. అక్రమంగా తరలిస్తున్న ( police seized the beef) 23 టన్నుల గో మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వెటర్నరీ వైద్యుల సమక్షంలో మాంసాన్ని పరీక్షలు చేయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ మాంసాన్ని ఎప్పటి నుంచి రవాణా చేస్తున్నారు, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దీనిపై విచారిస్తున్నారు.


గోమాంసాన్ని అక్రమంగా తరలించడం ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా విశాఖ మీదుగా అనేక ప్రాంతాలకు తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు అనంతరం నిందితులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. గోమాంసాన్ని తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుతున్నారు.

Updated Date - Jan 21 , 2025 | 01:56 PM