ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dog saves boy: యజమానిపై పెంపుడు కుక్క విశ్వాసం.. బాలుడి కోసం పాముతో పోరాడి ప్రాణత్యాగం..

ABN, Publish Date - Jun 21 , 2025 | 09:34 AM

కుక్కకు కాస్తా అన్నం పెడితే చాలు ఎంతో విశ్వాసంగా ఉంటుంది. తన కడుపు నింపిన వారు కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధంగా ఉంటుంది. విశ్వాసానికి కుక్క ప్రతీక. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కుక్క తన యజమాని కొడుకుతో పోరాడేందుకు ప్రాణాలకు సైతం తెగించింది. విషపూరిత సర్పంతో పోరాటానికి దిగింది.

Dog Fight With snake

కుక్కకు (Dog) కాస్తా అన్నం పెడితే చాలు ఎంతో విశ్వాసంగా ఉంటుంది. తన కడుపు నింపిన వారు కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధంగా ఉంటుంది. విశ్వాసానికి కుక్క ప్రతీక. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (UttarPradesh)కు చెందిన ఓ కుక్క తన యజమాని కొడుకును కాపాడేందుకు ప్రాణాలకు సైతం తెగించింది. విషపూరిత సర్పంతో (Snake) పోరాటానికి దిగింది. ఆ క్రమంలో తన ప్రాణాలు కోల్పోయింది. అయితే తన యజమాని కొడుకును మాత్రం కాపాడగలిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు సమీపంలోని రాంపురి మొహల్లా గ్రామానికి చెందిన రైతు కల్లూ ఇంట్లోకి అత్యంత విషపూరిత సర్పం రస్సెల్ వైపర్ తెల్లవారుఝామున మూడు గంటల ప్రాంతంలో ప్రవేశించింది. ఇంటి సభ్యులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కల్లూ కుమారుడు ప్రధాన ద్వారం దగ్గర నిద్రపోతున్నాడు. అతడికి సమీపంలోకి పాము వెళుతుండడాన్ని చూసిన ఆ పెంపుడు కుక్క మినీ వెంటనే దాని పైకి దూకింది. ఆ పామును తన నోటితో పట్టుకుని మొరుగుతూనే ఉంది.

కుక్క మొరగడంతో ఇంటి సభ్యులు వెంటనే లేచి అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ పాము ఆ కుక్కను పలుసార్లు కాటు వేసింది. ఆ పాము ఎన్నిసార్లు కాట్లు వేసినా ఆ కుక్క మాత్రం దానిని వదిలిపెట్టలేదు. నిద్ర నుంచి మేల్కొన్న కుటుంబ సభ్యులు ఆ పామును బంధించి అడవిలో వదిలేశారు. అయితే ఈ పోరాటంలో మినీ ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది.

ఇవి కూడా చదవండి..

మీ దృష్టికి పరీక్ష.. ఈ మంచులో ఎలుగుబంటి ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Bride and Groom: వేదిక పైనే వరుడిని ముద్దులతో ముంచెత్తిన వధువు.. పురోహితుడి రియాక్షన్ చూస్తే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 21 , 2025 | 09:34 AM