Child watching Mobile: మీ పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తున్నారా? ఈ ట్రిక్ ఉపయోగించి చూడండి..
ABN, Publish Date - Jul 31 , 2025 | 03:08 PM
ప్రస్తుతం చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ మొబైల్‌కు బానిసలుగా మారిపోతున్నారు. గంటల కొద్దీ సమయం మొబైల్ చూస్తూ గడిపేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలైతే మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు. వారు తినాలన్నా, ఏడుపు ఆపాలన్నా, కుదురుగా ఒక దగ్గర కూర్చోవాలన్నా మొబైల్ ఇవ్వాల్సిందే.
ప్రస్తుతం చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ మొబైల్‌కు (Mobile) బానిసలుగా మారిపోతున్నారు. గంటల కొద్దీ సమయం మొబైల్ చూస్తూ గడిపేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలైతే మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు. వారు తినాలన్నా, ఏడుపు ఆపాలన్నా, కుదురుగా ఒక దగ్గర కూర్చోవాలన్నా మొబైల్ ఇవ్వాల్సిందే (Mobile Addiction). లేకపోతే వారు మొబైల్ కోసం చేసే గొడవ అంతా ఇంతా కాదు. పిల్లలకు మొబైల్‌ను దూరం చేసేందుకు తల్లిదండ్రులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు (child watching mobile).
పిల్లలకు మొబైల్‌ను దూరం చేసేందుకు రకరకాల ట్రిక్‌లు వాడుతుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ట్రిక్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. Captainknows2 అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడు మొబైల్ చూస్తూ కూర్చున్నాడు. ఆ సమయంలో ఆ కుర్రాడి తండ్రి తన వాట్సాప్ నెంబర్‌కు దెయ్యం ముఖం ఉన్న డీపీని సెట్ చేశాడు. అనంతరం ఆ కుర్రాడు చూస్తున్న ఫోన్‌కు వీడియో కాల్ చేశాడు (Trick to Parents).
దెయ్యం మొహంతో వచ్చిన ఆ వీడియోను చూసి చూసి ఆ పిల్లాడు భయపడిపోయాడు. మొబైల్ వదిలేసి పారిపోయాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. చాలా మంది ఆ వీడియోను చూసి తమ స్పందనలను తెలియజేశారు. ఇది పనికొచ్చే ట్రిక్‌లాగానే ఉందని ఒకరు కామెంట్ చేశారు. ఈ ట్రిక్ చాలా బాగుందని, తాను కూడా ఉపయోగిస్తానని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వేదిక మీద గిఫ్ట్ ఇచ్చిన వరుడు.. కుప్పకూలిన వధువు సోదరి.. కారణమేంటంటే..
మీ పరిశీలనా శక్తికి సవాల్.. ఈ ఏనుగుల మధ్యలోనున్న రైనోను 5 సెకెన్లలో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 31 , 2025 | 03:08 PM