Share News

Bride and Groom: వేదిక మీద గిఫ్ట్ ఇచ్చిన వరుడు.. కుప్పకూలిన వధువు సోదరి.. కారణమేంటంటే..

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:17 PM

పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంటాయి. పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Bride and Groom: వేదిక మీద గిఫ్ట్ ఇచ్చిన వరుడు.. కుప్పకూలిన వధువు సోదరి.. కారణమేంటంటే..
Funny Wedding video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లకు (Wedding) సంబంధించిన వీడియోలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంటాయి. పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Funny Wedding video).


clip.craftar అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వేదిక మీద వధూవరులు ఉన్నారు. అక్కడకు వధువు సోదరి వచ్చింది. వధువు సోదరి ముందు వరుడు (Bride) ఓ గిఫ్ట్ ప్యాక్‌ను తెరవడం స్టార్ట్ చేశాడు. అది ఓపెన్ చేయగానే ఓ కప్ప నేరుగా వధువు సోదరి మీదకు ఎగిరింది. భయపడిన ఆ మహిళ గట్టిగా కేకలు వేస్తూ అక్కడికక్కడే పడిపోయింది. అయితే అది నిజం కప్ప కాదు. వదినను ఏడిపించేందుకు వరుడు చేసిన చిలిపి పని అది. ఆ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. 63 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వివాహం రద్దయింది అంటూ ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. మొత్తం మహిళా ప్రపంచం నివ్వెరపోయిందని మరొకరు పేర్కొన్నారు. పురుష సమాజం మొత్తం ఆనందంలో మునిగిపోయిందని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..

ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 30 , 2025 | 03:17 PM