ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

UK Genetic Disorder: 33 శాతం జన్యు వ్యాధుల కేసులకు పాకిస్థానీలే కారణం.. బ్రిటన్ దేశస్థుడి కామెంట్

ABN, Publish Date - Jul 11 , 2025 | 08:41 PM

బ్రిటన్‌లో 33 శాతం జన్యు వ్యాధుల కేసులకు పాకిస్థానీలే కారణమంటూ ఓ బ్రిటన్ వ్యక్తి పెట్టిన పోస్టుపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. జనాలు ఈ ఉదంతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విద్వేషం వ్యాపింప చేయొద్దని హితవు పలుకుతున్నారు.

Pakistanis UK, genetic disorders

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌లో వెలుగు చూస్తున్న 33 శాతం జన్యు వ్యాధుల కేసులకు పాకిస్థానీలే కారణమంటూ ఓ అతివాద బ్రిటన్ దేశస్థుడు నెట్టింట పంచుకున్న పోస్టు వివాదాస్పదంగా మారింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టామీ రాబిన్సన్ అనే యాక్టివిస్ట్ ఈ పోస్టు పెట్టారు. బ్రిటన్‌లోని పాకిస్థానీ సంతతి వారిలో 76 శాతం మంది తమ ఫస్ట్ కజిన్స్‌నే (తల్లిదండ్రులకు తోడ బుట్టిన వారి సంతానం) వివాహమాడతారని తెలిపారు. బ్రిటన్‌ జనాభాలో పాక్ సంతతి వారి వాటా 3 శాతమే అయినా జన్యువ్యాధులతో పుడుతున్న 33 శాతం మంది శిశువులకు వారే కారణమని ఆరోపించారు. దీని వల్ల నేషనల్ హెల్త్ సర్వీసుపైన ఆర్థిక భారం అమితంగా ఉంటోందని అన్నారు. అయితే, రాబిన్సన్ వ్యాఖ్యల్లో జాత్యాహంకారం స్పష్టంగా కనిపిస్తోందని జనాలు మండిపడుతున్నారు. అతడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ వర్గంపై ద్వేషాన్ని రెచ్చగొట్టద్దంటూ హితవు పలికారు.

ది బార్న్ ఇన్ బ్రాడ్‌ఫర్డ్ రీసెర్చ్ జరిపిన అధ్యయనం ప్రకారం, 2007-2010 మధ్య కాలంలో పాకిస్థానీ వివాహాల్లో 60 శాతం బంధువుల మధ్య జరిగినవే. అయితే, 2016-19 మధ్య కాలంలో ఈ సంఖ్య 46 శాతం తగ్గింది. బ్రిటన్‌లోని పుడుతున్న పిల్లల్లో 3 శాతం మంది పాకిస్థానీ సంతతి వారు. అయితే, పుట్టుకతో జన్యువ్యాధుల బారిన పడుతున్న కేసుల్లో 33 శాతం పాకిస్థానీ సంతతి శిశువులే ఉన్నట్టు ఆ సర్వేలో తెలిసింది.

బ్రిటన్‌లో కజిన్స్ మధ్య వివాహాలకు చట్టబద్ధత ఉంది. అయితే, ఈ వివాహాలపై నిషేధం విధించాలంటూ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ రిచర్డ్ హోల్డన్ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు ప్రభుత్వ మద్దతు లభించలేదు. వీటిని నిషేధించేందుకు తాము ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది.

ఇవీ చదవండి:

మద్యం కోసం ఆరాటం.. ఇనుప చువ్వల మధ్య తల ఇరుక్కుపోవడంతో..

ఈ పని మాత్రం అస్సలు చేయొద్దు.. హెచ్‌1బీ వీసాదారులకు నెటిజన్ సూచనపై పెద్ద చర్చ

Read Latest and Viral News

Updated Date - Jul 11 , 2025 | 09:33 PM