Liquor Shop Incident: మద్యం కోసం ఆరాటం.. ఇనుప చువ్వల మధ్య తల ఇరుక్కుపోవడంతో..
ABN , Publish Date - Jul 11 , 2025 | 06:57 PM
షాపు మూసివేస్తున్న తరుణంలో మద్యం కొనుగోలుకు ప్రయత్నించి ఇక్కట్లపాలైన ఓ మందు బాబు వీడియో తెగ వైరల్ అవుతోంది. షాపు కౌంటర్ కిటికీకి ఉన్న చువ్వల మధ్య అతడి తల ఇరుక్కుపోయిన వైనం చూసి జనాలు పడీ పడీ నవ్వుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మద్యపానానికి బానిసైన ఓ వ్యక్తి చివరకు ఊహించని చిక్కుల్లో పడ్డ వైనం తాలూకు వీడియో ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. జనాలకు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తోంది. ఫుల్లుగా తాగున్న స్థితిలో ఓ వ్యక్తి తానేమి చేస్తోందీ గుర్తించలేక చివరకు ఇబ్బందుల్లో పడ్డాడు.
@jist.news అనే ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఘటన ఎక్కడ జరిగిందీ తెలియరానప్పటికీ జనాలు మాత్రం ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం మద్యం మత్తులో ఓ వ్యక్తి మరో సీసా కొనుగోలుకు తెగ ఆరాటపడ్డాడు. అప్పటికే షాపు మూసేస్తున్నా గ్రహించుకోలేని స్థితిలో ఉన్న అతడు ఏకంగా షాపు కౌంటర్ కిటికీకి ఉన్న గ్రిల్స్‌లోంచి తల దూర్చి మద్యం కొనుగోలుకు ప్రయత్నించాడు.
చివరకు అతడు ఎలాగొలా మద్యం సీసాను చేజిక్కించుకున్నప్పటికీ అతడి తల మాత్రం గ్రిల్స్ మధ్య ఇరుక్కుపోయింది. గ్రిల్స్ మధ్య నుంచి ఎలా బయటపడాలో తెలీక అతడు ఇక్కట్ల పాలయ్యాడు. చివరకు చుట్టుపక్కల వారు రంగంలోకి దిగడంతో పరిస్థితి చక్కబడింది. వారు చువ్వలను పక్కకు బలంగా లాగడంతో ఆ వ్యక్తి తలను బయటకు లాక్కోగలిగాడు. అక్కడున్న కొందరు మాత్రం అతడి పరిస్థితిని చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు.
‘మద్యం కోసం ఆరాటం.. చివరకు ఇలా’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. పడీపడీ నవ్వుకుంటున్నారు. కొందరు వీడియోలోని ఫన్నీ సన్నివేశాలపై స్పందించారు. ‘చువ్వల మధ్య తల ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నా కూడా అతడు తన చేతిలో మద్యం బాటిల్‌ను మాత్రం విడిచిపెట్టలేదు. పట్టుదల అంటే ఇలా ఉండాలి’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. మరి మీరూ ఈ లుక్కేయండి.
ఇవీ చదవండి:
ఈ కుర్రాడు ప్రపంచవ్యాప్తంగా వైరల్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ఇలాంటి మోసం మీరెక్కడా చూసుండరు.. దుస్తుల షాపులోకి దూరిన దొంగ..