Viral Video: అదృష్టం అంటే ఇదే.. పెద్ద ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నాడో చూడండి..
ABN, Publish Date - Jun 01 , 2025 | 08:16 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నమ్మశక్యం కాని వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నమ్మశక్యం కాని వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి పెద్ద ప్రమాదం (Accident) నుంచి అద్భుతంగా తప్పించుకున్నాడు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
@umashankarsingh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఖాళీ రోడ్డుపై వ్యాన్ వస్తోంది. పక్కనే ఉన్న రోడ్డు నుంచి ముగ్గురు వ్యక్తులు బైక్ మీద వేగంగా వస్తున్నారు. ఆ బైక్ మలుపు తిరిగి ఆ వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిపోయింది. బైక్‌తో పాటే దాని మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు కాలువలో పడిపోయారు. అయితే చివర కూర్చున్న వ్యక్తి అదృష్టవశాత్తూ వంతెనను పట్టుకుని తనను తాను కాపాడుకున్నాడు. ఈ సంఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను కొన్ని గంటల్లోనే దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. దాదాపు ఐదు వేల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆ వ్యక్తి స్పైడర్‌మ్యాన్‌లా ఉన్నాడని ఒకరు కామెంట్ చేశారు. ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వావ్.. సూపర్ ఐడియా.. వాటర్ బాటిల్‌తో ఇంత లైటింగ్ వస్తుందా.. వీడియో వైరల్
మీ కళ్లు ఎంతో పవర్‌ఫుల్ అయితేనే.. ఈ ఫొటోలో సూదిని 10 సెకెన్లలో కనిపెట్టండి
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 01 , 2025 | 08:16 PM