Jugaad Video: వావ్.. సూపర్ ఐడియా.. వాటర్ బాటిల్‌తో ఇంత లైటింగ్ వస్తుందా.. వీడియో వైరల్
ABN , Publish Date - May 28 , 2025 | 04:37 PM
ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. దీంతో రాత్రి వేళల్లో వెలుగు లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ లేనప్పుడు చిన్న ట్రిక్‌తో గదిని వెలుతురుతో నింపేసే సూపర్ టెక్నిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వేసవి కాలం వచ్చిందంటే విద్యుత్ (Electricity) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. దీంతో రాత్రి వేళల్లో వెలుగు లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ లేనప్పుడు చిన్న ట్రిక్‌తో (Trick) గదిని వెలుతురుతో నింపేసే సూపర్ టెక్నిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు (Viral Video).
chanda_and_family_vlogs అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ యువతి తన చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని ఉంది. ఆ మొబైల్ ఫ్లాష్ లైట్ (Mobile Flash Light) వెలుగుతోంది. ఆ తర్వాత ఆమె ఓ ఖాళీ ప్లాస్టిక్ సీసా నిండా నీరు నింపింది. ఆ బాటిల్‌ను ప్లాష్ లైట్ మీద పెట్టింది. ఆ తర్వాత గదిలో లైట్ ఆపేసింది. అయితే ఫ్లాష్ లైట్ మీద పెట్టిన వాటర్ బాటిల్ (Water Bottle) నుంచి వస్తున్న వెలుతురు ఆ గది అంతా పరుచుకుంది. ఆ టెక్నిక్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న ఆ వీడియోను 20 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 2.3 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఐడియా బాగుందని చాలా మంది కామెంట్లు చేశారు. కరెంట్ పోయినా ఎవరూ తమ ఫోన్‌ను అలా ఇవ్వడానికి ఇష్టపడరని ఒకరు కామెంట్ చేశారు. కరెంట్ వచ్చే వరకు ఫోన్‌ను వాడకుండా ఉండే వాళ్లు ఈ రోజుల్లో ఉన్నారా అంటూ మరొకరు ఫన్నీగా ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
రైల్వే శాఖకే షాకిచ్చాడు.. రైలు పట్టాల మీద జేసీబీని ఎలా నడిపించాడో చూడండి..
మీ కళ్లు ఎంతో పవర్‌ఫుల్ అయితేనే.. ఈ ఫొటోలో సూదిని 10 సెకెన్లలో కనిపెట్టండి
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..