ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మామూలోడు కాదు.. జాకెట్‌లో మందు సీసాలు దాచి..

ABN, Publish Date - Jun 22 , 2025 | 05:55 PM

Viral Video: మందు సీసాలను ఎవరికీ తెలియకుండా తీసుకురావటానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన జాకెట్ కుట్టించాడు. ఆ జాకెట్లో మద్యం సీసాలు పట్టేలా పాకెట్లు పెట్టించాడు.

Viral Video

ఎవ్వరికీ దొరకకుండా నేరం చేయటం అన్నది అన్నిటికంటే పెద్ద ఆర్ట్. అది అందరికీ రాదు. అందుకే నేరం చేసిన వాళ్లు ఈజీగా పోలీసులకు దొరికిపోతూ ఉంటారు. తాజాగా, ఓ వ్యక్తి హాలీవుడ్ సినిమా లెవెల్‌లో మందు బాటిళ్లను అక్రమ రవాణా చేద్దాం అనుకున్నాడు. పక్కా ప్లాన్‌తో బాటిళ్లను తీసుకెళుతూ పోలీసులకు దొరికిపోయాడు. అంగీ లోపల దాచి తీసుకెళుతున్న మందు సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పెండల్వాడకు చెందిన కార్డె అశోక్‌ దేశీదారు మద్యం సీసాలను మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి అక్రమ రవాణా చేశాడు. మందు సీసాలను ఎవరికీ తెలియకుండా తీసుకురావటానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన జాకెట్ కుట్టించాడు. ఆ జాకెట్లో మద్యం సీసాలు పట్టేలా పాకెట్లు పెట్టించాడు. పాకెట్లలో 24 మందు సీసాలు పెట్టి మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి తీసుకువచ్చాడు.

అయితే, అనుకోని విధంగా అతడి ప్లాన్ ఫెయిల్ అయింది. అబ్కారీ అధికారులకు అతడిపై అనుమానం వచ్చింది. అశోక్‌ను ఆపి చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. అతడినుంచి మందు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘నీ తెలివి మామూలుగా లేదు. అదృష్టం అడ్డం తిరిగి దొరికిపోయావు కానీ, లేదంటే కోట్లు సంపాదించే వాడివి’అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇరాన్‌పై అమెరికా దాడి.. తీవ్రంగా ఖండించిన పాక్..

సింగయ్య కేసు.. A2గా వైఎస్ జగన్!

Updated Date - Jun 22 , 2025 | 07:27 PM