Singayya Case: సింగయ్య కేసు.. A2గా వైఎస్ జగన్!
ABN , Publish Date - Jun 22 , 2025 | 03:13 PM
Singayya Case: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య మరణించిన కేసులో కారు డ్రైవర్ రమణారెడ్డిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A1గా కారు డ్రైవర్ రమణారెడ్డిని, A2గా వైఎస్ జగన్‌ను, A3గా కారు యజమానిని చేర్చాలని పోలీసులు నిర్ణయించారు.
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య మరణించిన కేసులో కారు డ్రైవర్ రమణారెడ్డిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A1గా కారు డ్రైవర్ రమణారెడ్డిని, A2గా వైఎస్ జగన్‌ను, A3గా కారు యజమానిని చేర్చాలని పోలీసులు నిర్ణయించారు. యాక్సిడెంట్‌లో సింగయ్య చనిపోయిన రోజు ఐపీఎస్‌లోని 304ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కెమెరా విజువల్స్‌లో అది జగన్ ప్రయాణిస్తున్న కారు అని తేలడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్‌లో అదనంగా 304 పార్ట్ 2 సెక్షన్ వర్తించే అవకాశం ఉంది. బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఎఫ్ఐఆర్‌లో సెక్షన్స్ మార్చి కోర్ట్ మెమో పంపాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులు అందరూ భేటి అయ్యారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అప్పుడు బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు పిలిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు.. బాలయ్య కీలక వ్యాఖ్యలు
ఇటీవలే పెళ్లైన యువకుడికి భారీ షాక్.. భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుంటే..