Lion vs Leopard: చిరుత తెలివికి హ్యాట్సాఫ్.. సింహాన్ని ఎలా బోల్తా కొట్టించి తన ప్రాణాలను కాపాడుకుందో చూడండి..
ABN, Publish Date - Jul 21 , 2025 | 07:38 PM
సింహం పిల్లలను చిరుతలు వేటాడి మరీ చంపుతుంటాయి. అందుకే చిరుతలు అంటే సింహాలకు పడదు. చిరుత కనబడితే సింహాలు కోపంగా పోరాటానికి దిగుతాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరుత పులి (Leopard) వేగానికి ప్రసిద్ధి. చిరుతతో పోటీ పడి పరిగెత్తే మరో జంతువు ఈ భూమి మీద లేదు. చిరుత ఏ జంతువునైతే టార్గెట్ చేస్తుందో అది దానికి దొరికి తీరాల్సిందే. అయితే చిరుత ఆటలు సింహం (Lion) ముందు సాగవు. సింహానికి దొరికితే చిరుత ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్టే. నిజానికి సింహం పిల్లలను చిరుతలు వేటాడి మరీ చంపుతుంటాయి. అందుకే చిరుతలు అంటే సింహాలకు పడదు. చిరుత కనబడితే సింహాలు కోపంగా పోరాటానికి దిగుతాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Lion vs Leopard video).
visit__tanzania అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. టాంజానియా (Tanzania)లోని అడవుల్లో ఈ వీడియోను చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ చిరుత పులి సింహానికి దొరికిపోయింది. సింహం దానిని ఎలాగైనా చంపాలని ఫైట్ చేస్తోంది. సింహం బలం ముందు చిరుత పోరాటం సరిపోవడం లేదు. అయితే చిరుత చాలా తెలివిగా ఫైట్ చేసింది. నిలబడకుండా నేలపై పడుక్కుని తన పదునైన గోళ్లతో దాడి చేస్తూ సింహం నుంచి కాపాడుకుంటోంది. చిరుత పులి గోళ్లు బ్లేడ్ల కంటే పదునుగా ఉంటాయి. ఆ గోళ్లతో చిరుత దాడికి దిగుతుండడంతో సింహం ఒక్క అడుగు వెనక్కి వేసింది.
సింహం పట్టు వదలడంతో రన్నింగ్‌లో ఛాంపియన్ అయిన చిరుత అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయింది. ఈ వీడియోను జంగిల్ సఫారీ టూరిస్ట్‌లు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. బలవంతుడిని ఎదుర్కోవాలంటే తెలివి, వేగం కావాలని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఆ పిల్లి ప్రమాదాన్ని ఎలా పసిగట్టిందో చూడండి.. యజమానిని కాపాడి..
మీ చూపు షార్ప్ అయితే.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 21 , 2025 | 07:38 PM