Cat saves Woman: ఆ పిల్లి ప్రమాదాన్ని ఎలా పసిగట్టిందో చూడండి.. యజమానిని కాపాడి..
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:50 PM
ప్రకృతిని అర్థం చేసుకోవడంలో మనుషుల కంటే జంతువులు మెరుగ్గా ఉంటాయి. ప్రమాదాలను ముందుగానే పసిగడతాయి. తాజాగా ఓ పిల్లి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తన యజమానిని అప్రమత్తం చేసింది. దీంతో ఆమె పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది.
జంతువులు (Animals) మాట్లాడలేవు. మనుషుల్లా తెలివితేటలతో ప్రవర్తించలేవు. అయితే ప్రకృతిని అర్థం చేసుకోవడంలో మనుషుల కంటే మెరుగ్గా ఉంటాయి. ప్రమాదాలను ముందుగానే పసిగడతాయి. తాజాగా ఓ పిల్లి (Cat) ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తన యజమానిని అప్రమత్తం చేసింది. దీంతో ఆమె పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
phoenixtv_news అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చైనా (China)లో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన ఇంటి లివింగ్ రూమ్‌లో కూర్చుని ఫోన్ చూసుకుంటోంది. ఆ గదిలో మూడు పిల్లులు ఉన్నాయి. వాటిల్లో ఒక పిల్లి గోడ దగ్గర నిల్చుని ఉంది. ఆ గోడ పడిపోబోతోందని ముందుగానే గ్రహించింది. కాసేపటికి ఇతర పిల్లులు కూడా ప్రమాదాన్ని పసిగట్టి అక్కడి నుంచి పరుగులు పెట్టాయి. మొబైల్ నుంచి చూపు తిప్పిన ఆ మహిళ కూడా అక్కడి నుంచి పరిగెత్తింది.
ఆమె అటు వెళ్లగానే టీవీ వెనుక ఉన్న గోడకు అమర్చిన టైల్స్ కింద పడిపోయాయి. అవి నేరుగా ఆ మహిళ కూర్చున్న చోట పడ్డాయి. ఆమె ఇంకా కాసేపు అక్కడే ఉండి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను పది లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 1.5 లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. పిల్లులు నిజంగా ప్రమాదాన్ని ముందుగానే గ్రహిస్తాయని ఒకరు పేర్కొన్నారు. అవి కేవలం పెంపుడు జంతువులే కాదని, మానవుల జీవితాల సంరక్షకులని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మెడలో పామును పెట్టుకుని బైక్ డ్రైవింగ్.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
మీ చూపు షార్ప్ అయితే.. ఈ అడవిలో కప్ కేక్ ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..