ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

King Cobra: కోడె నాగును ఇంత ముద్దుగా ఎప్పుడూ చూసుండరు..

ABN, Publish Date - May 12 , 2025 | 12:48 PM

King Cobra: ఇండోనేషియాకు చెందిన సహబత్ అలామ్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ కోడె నాగును అందంగా మార్చేశాడు. దాని తలకు చేత్తో అల్లిన టోపీ తగిలించటంతో అది చిన్న పాపలాగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అయింది.

King Cobra

పాము అని వినపడగానే.. నూటికి 99 శాతం మంది గుండెలు జల్లుమంటాయి. భయంతో చెమటలు కూడా పడతాయి. పామును లైవులో.. దగ్గరగా చూస్తే ఆ పరిస్థితి గురించి వర్ణించటం కష్టమే. నవనాడులు నాట్యం ఆడుతాయి. అలాంటిది ఓ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన కోడె నాగుతో ఆటలు ఆడాడు. దానికి టోపీ పెట్టి అందంగా ముస్తాబు చేశాడు. పాములంటే భయపడేవారు కూడా దాన్ని చూసి ‘ చో క్యూట్’ అనకమారరు. అంతలా అందంగా మారిపోయింది.


ఇండోనేషియాకు చెందిన సహబత్ అలామ్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ కోడె నాగు తలకు చేత్తో అల్లిన ఓ టోపీని తగిలించాడు. ఆ టోపీలో కోడె నాగు చూడ్డానికి ఎంతో అందంగా మారిపోయింది. అచ్చం చిన్న పాపలాగా అనిపించింది. పాముకు టోపీ పెట్టిన తర్వాత అతడు దాంతో ఆటలు ఆడాడు. అది కోపంతో దాడి చేయడానికి ప్రయత్నిస్తే.. ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు. సహబత్ దీన్నంతా వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.


మిలియన్‌కు పైగా వ్యూస్ తెచ్చుకుంది. పెద్ద సంఖ్యలో లైకులు, కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ బ్రో దాన్ని సీరియస్‌గా తీసుకో.. అదొక పామని మర్చిపోతున్నావు’..‘ కింగ్ కోబ్రా కాదు.. కింగ్ బేబీ’..‘ హా హా హా హా .. చాలా క్యూట్‌గా ఉంది’.. ‘ టాక్సిక్ రిలేషన్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో అతడు మనకు నేర్పుతున్నాడు’.. ‘ చాలా క్యూట్‌గా.. చాలా ఫన్నీగా ఉంది’.. ‘ పాములతో ఆ ఆటలేంటి భయ్యా.. చూస్తున్న మాకే గుండె దడగా ఉంది‘ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, టోపీతో ఉన్న కోడె నాగు గురించి మీరెమనుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్‌కు వార్నింగ్..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. శాటిలైట్ ఫొటోలు విడుదల చేసిన ఆర్మీ..

Updated Date - May 12 , 2025 | 12:48 PM