ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Woman Dances With Gun: రీల్స్ పిచ్చి.. గన్నుతో హైవేపై హల్‌చల్ చేసిన మహిళ..

ABN, Publish Date - Jul 10 , 2025 | 08:38 AM

Woman Dances With Gun: నడిరోడ్డుపై గన్ను పట్టుకుని డ్యాన్స్ చేసింది ఓ మహిళ. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. పోలీసు అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో పోలీసులు ఆమెపై చర్యలకు సిద్దమయ్యారు.

Woman Dances With Gun

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి.. వేలు, లక్షలు సంపాదించాలి. ఈ డబ్బు ఆశే కొంతమందిని పిచ్చిపిచ్చి పనులు చేసేలా ప్రేరేపిస్తోంది. ఓవర్‌నైట్ స్టార్ అవ్వటం కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న వారు కూడా లేకపోలేదు. తాజాగా, ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో ఓ పిచ్చి పని చేసింది. పట్టపగలు గన్నుతో హైవేపై రెచ్చిపోయింది. గన్ను పట్టుకుని ఊగిపోతూ డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌కు చెందిన షాలినీ పాండేకు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.

60 వేల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. త్వరలో ఫాలోయింగ్‌ను లక్షకు తీసుకెళ్లాలని ఆమె టార్గెట్ పెట్టుకుంది. కేవలం డ్యాన్సులు మాత్రమే చేస్తే ఫాలోవర్స్ రావటం లేదని.. ఓ క్రిమినల్ పనికి తెరతీసింది. గన్నుతో కాన్పూర్- ఢిల్లీ నేషనల్ హైవేపైకి వెళ్లింది. నడిరోడ్డుపై గన్ను పట్టుకుని డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. పోలీసు అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో పోలీసులు ఆమెపై చర్యలకు సిద్దమయ్యారు.

కాగా, మరో ఘటనలో ఒరిస్సాలోని బౌద్ జిల్లా పూరునాపానీ గ్రామానికి చెందిన 12 ఏళ్ల కుర్రాడు ఇన్‌స్టాలో ఫేమస్ కావాలన్న ఉద్దేశ్యంతో ప్రాణాలకు తెగించాడు. తన మిత్రులతో కలిసి ఓ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. జూన్ 29వ తేదీన బాలుడు రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. రైలు వేగంగా వచ్చి అతడి మీద నుంచి వెళ్లిపోయింది. అదృష్టం బాగుండి అతడికి ఏమీ కాలేదు. మరో బాలుడు దీన్నంతా వీడియో తీశాడు. దాన్ని ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. వీడియో వైరల్ అయింది. రైల్వే అధికారులు రంగంలోకి దిగి వారిపై చర్యలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. 29మంది సెలెబ్రిటీలపై ఈడీ కేసు

వడోదర బ్రిడ్జి ఘటన.. నదిలో కొడుకు కోసం వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి

Updated Date - Jul 10 , 2025 | 01:37 PM