ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Japan: జపాన్‌లో జీవితమంటే రోజూ పరీక్షే.. భారతీయ యువకుడి వ్యాఖ్యలు వైరల్

ABN, Publish Date - Jun 16 , 2025 | 09:27 AM

జపాన్‌లో చెత్త విషయంలో ఎలాంటి కఠిన నిబంధనలు అమలవుతున్నాయో చెబుతూ ఓ భారతీయుడు నెట్టింట పంచుకున్న వీడియోపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Japan waste management

ఇంటర్నెట్ డెస్క్: జపాన్ అంటేనే టెక్నాలజీకి పర్యాయపదం. అయితే, పరిశుభ్రత, క్రమశిక్షణకు కూడా జపాన్ పేరుగాంచింది. అక్కడి రోడ్లను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అక్కడి వీధులన్నీ శుభ్రంగా ఉంటాయి. భూతద్దం పెట్టి వెతికినా చెత్తాచెదారం కనిపించనంత స్థాయిలో వీధులు ఉంటాయి. మరి ఇంతటి శుభ్రత సాధించేందుకు జపాన్ ప్రభుత్వం ఎలాంటి కఠిన నిబంధనలు అమలు చేస్తోందో చెబుతూ ఓ భారతీయ యువకుడు నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జపాన్‌లో బతుకంటే రోజూ పరీక్ష అంటూ అతడు చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి.

ఢిల్లీకి చెందిన ఓ కంటెంట్ క్రియేటర్ ఈ వీడియో పోస్టు చేశాడు. తాను మూడేళ్లుగా జపాన్‌లో ఉంటున్నానని అన్నాడు. ఇక్కడ చెత్త విషయంలో కఠిన నిబంధనలు అమలవుతుంటాయని, వీటిని ఫాలో అవడం ఓ పరీక్ష లాగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. నిబంధనలు పాటించని జనాల చెత్తను తీసుకెళ్లేందుకు సిబ్బంది ఒప్పుకోరని అన్నాడు. భారీ జరిమానాలు కూడా విధిస్తారని తెలిపాడు.

అతడు చెప్పిన వివరాల ప్రకారం, జపాన్‌లో ఒక్కో తరహా చెత్తను ఒక్కో రకమైన కవర్‌లో వెయ్యాలి. తడి చెత్తను ఒక రోజున, పొడి చెత్తను సిబ్బంది మరొక రోజున తీసుకెళతారు. ఇక ఏ బ్యాగులో ఏ రకమైన చెత్త వేయాలనే దానిపై స్పష్టమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. వీటిని ఓ చిన్న కాగితంపై ప్రింట్ చేసి జనాలకు పంచుతారు. ఇందులోని రూల్స్‌ను తూచాతప్పకుండా పాటించాలి. ఇక చెత్త డబ్బాల పక్కన కూడా నిబంధనల బోర్డులను పెడతారు. ఏ చిన్న తప్పు జరిగినా భారీ జరిమానాలు చెల్లించకతప్పదు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం కూడా నిషిద్ధం. ఇలా అక్కడి విషయాలను ఆస్తికరంగా యువకుడు వర్ణించాడు.

ఈ వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ వ్యవస్థ భారత్‌లోనూ ఉంటే బాగుంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇండోర్ నగరంలో ఈ సిస్టమ్ ఇప్పటికే అమల్లో ఉందని కొందరు అన్నారు. జపాన్‌లో స్కూళ్లల్లోనే పిల్లలకు చెత్తను వేరు చేసి వేర్వేరు బ్యాగుల్లో ఎలా వేయాలో నేర్పిస్తారని అన్నారు. ఈ నిబంధనలపై చిన్నతనం నుంచే పకడ్బందీ తర్ఫీదు ఇస్తారని తెలిపారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియోకు ఏకంగా 1.5 మిలియన్ వ్యూ్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

12 వేల మంది అభ్యర్థులు.. ఒక్కరికీ జాబ్ ఇవ్వని సంస్థ.. ఎందుకో తెలిస్తే..

ఈ అంబులెన్స్ డ్రైవర్ టాలెంటే వేరబ్బా.. ఎలా డ్రైవ్ చేశాడో చూస్తే..

Read Latest and Viral News

Updated Date - Jun 16 , 2025 | 09:36 AM