IPL 2025: ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..
ABN, Publish Date - May 30 , 2025 | 03:41 PM
IPL 2025: చిరాయా నిజంగానే ఆర్సీబీకి మద్దతుగా ఆ పోస్టర్ పెట్టిందా.. లేక కామెడీ చేయడానికి అలా చేసిందా తెలీదు. కానీ, అక్కడి జనం మాత్రం ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. కొంతమంది ఆర్సీబీ కప్పుగెలిచి వారి కాపురాన్ని నిలబెట్టాలని ప్రార్థిస్తున్నారు.
‘ఈసాల కప్ నమదే..’ అని అనడం తప్ప ఆర్సీబీ ఇప్పటి వరకు కప్ గెలిచింది లేదు. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ 10 సార్లు ప్లేఆఫ్‌కు వెళ్లింది. ఆ పదిలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరుకుంది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకు వెళ్లింది. కానీ, కప్పు గెలవలేకపోయింది. ఇప్పుడు నాలుగో సారి ఫైనల్‌కు చేరుకుంది. ఆర్సీబీ ఈ సారైనా కప్పు గెలుస్తుందో లేదో ఆ దేవుడికే తెలియాలి. ఆర్సీబీ కప్పు గెలవాలంటూ ఫ్యాన్స్ దేవుడ్ని ప్రార్థిస్తూ ఉంటే.. యాంటీ ఫ్యాన్స్ ఆర్సీబీ గెలుపుపై కామెడీ చేస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఓ భార్య తన భర్తకు షాక్ ఇచ్చింది. ఆర్సీబీ ఫైనల్‌లో గెలవకపోతే భర్తకు విడాకులు ఇస్తానంటోంది. ఇంతకూ సంగతేంటంటే.. రెండు రోజుల క్రితం ఆర్సీబీకి, లక్నో సూపర్ జెయింట్స్‌కు మధ్య మ్యాచ్ జరిగింది. లక్నో స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు చిరాయా అనే మహిళ వెళ్లింది. ఆ మహిళ తన చేతిలో పోస్టర్ పట్టుకుని నిలబడింది. ఆ పోస్టర్ చూసి అక్కడి వాళ్లంతా అవాక్కయ్యారు. ఆ పోస్టర్‌లో ‘ ఆర్సీబీ అగర్ ఫైనల్ నహీ జీతీ తో మైనే అప్నీ పతీ కో తలాక్ దేదుంగీ( ఆర్సీబీ ఫైనల్ గెలవకుంటే.. నేను నా భర్తకు విడాకులు ఇచ్చేస్తాను) అని ఉంది.
చిరాయా నిజంగానే ఆర్సీబీకి మద్దతుగా ఆ పోస్టర్ పెట్టిందా.. లేక కామెడీ చేయడానికి అలా చేసిందా తెలీదు. కానీ, అక్కడి జనం మాత్రం ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ప్రస్తుతం చిరాయా పోస్టర్‌తో నిలబడ్డ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. త్వరగా ఫేమస్ అవ్వడానికి ఆమె స్టంట్ చేస్తోందంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఆర్సీబీ కప్పుగెలిచి వారి కాపురాన్ని నిలబెట్టాలని ప్రార్థిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఐఎన్ఎస్ విక్రాంత్‌పై నుంచి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్
ప్రతి మహిళ తప్పక చేయించుకోవాల్సిన 8 ఆరోగ్య పరీక్షలు..
Updated Date - Jun 04 , 2025 | 07:35 AM