ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025: ఆర్సీబీ గెలుపు.. ఈ మహిళ భర్త సేఫ్..

ABN, Publish Date - Jun 04 , 2025 | 07:33 AM

IPL 2025 RCB Win: కొద్దిరోజుల క్రితం ఆర్సీబీకి, లక్నో సూపర్ జెయింట్స్‌కు మధ్య లక్నో స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన చిరాయా వెళ్లింది. తన చేతిలో పోస్టర్ పట్టుకుని నిలబడింది.

IPL 2025

‘ఈ సాల కప్ నమదే..’ అని అనటమే కాదు.. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ కప్ కొట్టి చూపించింది. నిన్న పంజాబ్‌ కింగ్స్ ‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో తన జట్టు మొదటి సారి విజయం సాధించటంతో విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక, ఐపీఎల్2025లో ఆర్సీబీ కప్ ‌సాధించటం అందరికంటే చియారా అనే మహిళ భర్తకు సంతోషకరమైన విషయం.


ఎందుకంటే.. కొద్దిరోజుల క్రితం ఆర్సీబీకి, లక్నో సూపర్ జెయింట్స్‌కు మధ్య లక్నో స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన చిరాయా వెళ్లింది. తన చేతిలో పోస్టర్ పట్టుకుని నిలబడింది. ఆ పోస్టర్ చూసి అక్కడి వాళ్లంతా అవాక్కయ్యారు. ఆ పోస్టర్‌లో ‘ ఆర్సీబీ అగర్ ఫైనల్ నహీ జీతీ తో మైనే అప్నీ పతీ కో తలాక్ దేదుంగీ( ఆర్సీబీ ఫైనల్ గెలవకుంటే.. నేను నా భర్తకు విడాకులు ఇచ్చేస్తాను) అని ఉంది.


ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. చిరాయా ఆర్సీబీకి పిచ్చి ఫ్యాన్ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బట్టి తెలుస్తోంది. ఒక వేళ ఫైనల్‌లో ఆర్సీబీ ఓడిపోయి ఉంటే కచ్చితంగా విడాకులు ఇచ్చి ఉండేదేమో. దేవుడి దయ వల్ల.. ఆ భర్త అదృష్టం వల్ల ఆర్సీబీ గెలుపు సాధించింది. భర్తకు విడాకుల బాధ తప్పింది. ఆర్సీబీ గెలుపుతో చిరాయా సంతోషంలో మునిగితేలుతోంది. కేక్ కట్ చేసి మరీ సెలెబ్రేట్ చేసుకుంది.


18 ఏళ్ల తర్వాత తొలిసారి

ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ 10 సార్లు ప్లేఆఫ్‌కు వెళ్లింది. ఆ పదిలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరుకుంది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకు వెళ్లింది. కానీ, కప్పు గెలవలేకపోయింది. ఇప్పుడు నాలుగో సారి ఫైనల్‌కు చేరుకుంది. అభిమానులతో యావత్ కర్ణాటక రాష్ట్రం గర్వపడేలా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 18 ఏళ్ల తర్వాత తొలిసారి కప్ కొట్టింది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సైతం సంతోషం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లు ఎక్కడంటే..

Updated Date - Jun 04 , 2025 | 11:40 AM