ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indias First Private Railway Station: మన దేశంలో ప్రైవేటు రైల్వే స్టేషన్ ఒకటి ఉందని తెలుసా?

ABN, Publish Date - May 01 , 2025 | 10:13 AM

దేశంలోని తొలి ప్రైవేటు రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్‌లో ఉంది. దీన్ని రాణీ కమలాపతి స్టేషన్ అని పిలుస్తారు. ఎయిర్‌పోర్టు స్థాయి అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దారు.

Rani Kamalapati Railway Station

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ల్లో భారతీయ రైల్వే ఐదవ స్థానంలో ఉంది. సామాన్య ప్రజలకు అత్యంత చవకగా అందుబాటులో ఉన్న ప్రయాణ సాధనాల్లో రైళ్లే నెం.1. ప్రస్తుతం దేశంలో 7308 స్టేషన్లు ఉన్నాయి. రోజూ 13 వేల రైళ్లు సుమారు 20 మిలియన్‌ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. సమాజ సంక్షేమం ప్రధాన ఎజెండాగా నడిచే రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు సరకు రవాణానే. అయితే, రైల్వే కార్యకలాపాల్లో ప్రైవేటు రంగం భాగస్వామ్యం పెంచేందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈ దిశగా దేశంలో ఓ ప్రైవేటు రైల్వే స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు.


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌‌లోగల రాణీ కమలాపతి రైల్వే స్టేషన్‌లో దేశంలోనే తొలి ప్రైవేటు స్టేషన్‌గా పేరు పొందింది. గతంలో దీన్ని హబీబ్ గంజ్ స్టేషన్‌ అని పిలిచేవారు. 2007లో ప్రభుత్వం ఈ స్టేషన్‌ను ప్రైవెటీకరించింది. అనంతరం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో దీన్ని అత్యాధునిక హంగులతో ఎయిర్‌పోర్టు తరహా సౌకర్యాలతో తీర్చి దిద్దారు. బన్సల్ గ్రూప్, ఇండియన్ రైల్వేస్టేషన్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ దీన్ని సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఎయిర్ కండీషన్ ఉన్న లాబీలు, వేగవంతమైన ఎస్కలేటర్లు, రిటైల్ స్టోర్లు, కన్వెన్షన్ సెంటర్‌లు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. విద్యుత్, ఇంధన వినియోగం తగ్గించేలా ఈ స్టేషన్‌ను డిజైన్ చేశారు. సోలార్ ప్యానెల్స్‌ ఏర్పాటు చేశారు. అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు.


ఈ స్టేషన్ నిర్వహణ బాధ్యత బన్సల్ గ్రూపుదే. అయితే, స్టేషన్‌పై యాజమాన్యహక్కులు మాత్రం జాతి ప్రయోజనాల దృష్ట్యా భారత ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి. రైల్వే నిర్వహణ భవిష్యత్తుకు అద్దం పట్టేలా ఉన్న స్టేషన్‌ను 2021లో ప్రధాని మోదీ ఈ స్టేషన్‌ను ప్రారంభంచారు. భవిష్యత్తులో ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై సీఎస్‌టీ స్టేషన్లను కూడా ఇదే రీతిలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. భారత రైల్వేకు 160 ఏళ్ల చిత్ర ఉన్న విషయం తెలిసిందే. దేశంలో తొలి ప్యాసెంజర్ రైలు 1853 ఏప్రిల్ 16న ముంబై నుంచి థానే మధ్య ప్రయాణించింది.

ఇవి కూడా చదవండి:

సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలపై పాక్ ప్రజలు ఏమంటున్నారంటే..

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

Read Latest and Viral News

Updated Date - May 01 , 2025 | 11:45 AM