US: ఆఫీస్‌లో లంచ్‌కు రావాలంటూ పిలుపు.. అక్కడికెళ్లాక ఎన్నారై మహిళకు షాక్
ABN, Publish Date - Jul 01 , 2025 | 08:01 PM
అమెరికాలో ఉంటున్న ఓ భారత సంతతి మహిళ తమ ఆఫీసులో ఏర్పాటు చేసిన లంచ్‌లో శాకాహారాలేవీ అందుబాటులో ఉంచకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా అనేక మంది ఆమె పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ భారత సంతతి మహిళకు ఇటీవల భారీ షాక్ తగిలింది. ఆఫీస్‌లో లంచ్ ఏర్పాటు చేయడంతో వెళ్లిన ఆమె అక్కడ తను తినదగిన ఆహారం ఏదీ దొరక్క చివరకు సొంత డబ్బుతో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చింది. రున్‌ఝున్ అనే వైద్యురాలు ఇటీవల తనకు ఎదురైన ఈ దారుణ అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
‘నిన్న ఆఫీసులో ఓ కార్యక్రమం జరిగింది. లంచ్ తెచ్చుకోవద్దని మాకు చెప్పారు. దీంతో, నేను లంచ్ ప్యాక్ లేకుండా ఆఫీసుకు వెళ్లాను. కానీ అక్కడ శాకాహార వంటకం ఒక్కటి కూడా కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాను’
‘అక్కడ ఏకంగా 60 రకాల శాండ్‌విచ్‌లు కనిపించాయి. చాలా సంతోషం వేసింది. కోషర్, హలాల్, గ్లూటెన్ ఫ్రీ.. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. నిర్వహకులు మెనూ విషయంలో ఇంత జాగ్రత్త తీసుకున్నందుకు చాలా సంతోషం వేసింది. ఈలోపు నేను వెజిటేరియన్ శాండ్‌విచ్ అడిగేసరికి వారు తెల్లముఖం వేశారు. వారి వద్ద వెజిటేరియన్ ఏదీ లేకపోవడంతో మౌనంగా ఉండిపోయారు. అక్కడ అతిథులు తమ శాండ్ విచ్‌లు చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అంటే.. వెజిటేరియన్ కావాలనుకున్న వారు అక్కడి శాండ్‌విచ్‌లలోని నాన్ వెజ్ భాగాలను తిసేసి తినాలన్నమాట. ఇలా చాలా సార్లు జరిగింది’
‘శాకాహారులకు అనువైన ఏర్పాట్లు ఎందుకు చేయరు. శాకాహార వంటల్లో అవసరమైతే నాన్ వెజ్ వంటకాలు జోడించేలా ఏర్పాట్లు ఎందుకు చేయరు. ఇలా అయితే ఎవరికీ ఇబ్బంది ఉండదు కదా. అయితే, నాకు అక్కడ తినదగినది ఏదీ లేకపోవడంతో నేను తిరిగొచ్చేశాను. బయట నుంచి వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను’ అని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ ఉదంతం వైరల్ కావడంతో అనేక మంది ఆమె పరిస్థితికి విచారం వ్యక్తం చేశారు. తామూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కున్నామని అన్నారు. ఏ ఈవెంట్‌లో అయినా వెజిటేరియన్ వంటకాలు కచ్చితంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
మీటింగుల్లో మాట్లాడొద్దంటూ ముఖం మీద చెప్పిన అమెరికన్ సహోద్యోగి.. ఎన్నారైకి షాక్
ఇంతలా నన్ను అవమానిస్తారా.. ఇంకెప్పుడూ ఇండియాకు రాను: నెదర్‌లాండ్స్ పౌరుడు
Updated Date - Jul 01 , 2025 | 11:27 PM