ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Beach Culture: భారతీయ బీచ్‌ల్లో ఊహించని దృశ్యాలు.. షాక్‌లో ఫారినర్

ABN, Publish Date - Jun 01 , 2025 | 07:36 AM

భారతీయ బీచ్‌ల్లో పర్యాటకులు ఒంటి నిండా దుస్తులు ధరించి ఉండటం చూసి ఓ ఫారినర్ షాకైపోయాడు. అతడు షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Indian Beach Culture

ఇంటర్నెట్ డెస్క్: పాశ్చాత్య దేశాల్లో బీచ్‌లు భిన్నంగా ఉంటాయి. అక్కడి పర్యాటకులు ఒంటిపై షర్ట్ లేకుండా కనిపిస్తుంటారు. విదేశాల్లో అంతటా దాదాపుగా ఇదే సీన్ కనిపిస్తుంటుంది. అయితే, భారత్‌లో పర్యటిస్తున్న ఓ విదేశీ యువకుడు ఇక్కడి బీచ్‌ల్లో కూడా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణమని అనుకున్నాడు. వాస్తవం భిన్నంగా ఉండటంతో షాకైపోతూ వీడియో చేశాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో సదరు పర్యాటకుడు ఈ వీడియో పోస్టు చేశాడు. విదేశీ బీచ్‌ల్లో పర్యాటకులు టాప్ లెస్‌‌గా అంటే షర్ట్ లేకుండా ఉంటారని అన్నాడు. కానీ భారత్‌లో సీన్ చాలా భిన్నంగా ఉందని ఆశ్చర్యపోయాడు. ఇది భారత్‌లో తన తొలి బీచ్ పర్యటన అని కూడా చెప్పుకొచ్చాడు.


‘ఇండియాలో పర్యటిస్తున్నా. తొలిసారిగా బీచ్‌కు వచ్చా. ఇక్కడ అందరూ షర్ట్ వేసుకునే ఉన్నారు. ఒక్కరు కూడా టాప్‌లెస్‌గా లేరు. ఇక్కడ రెండు మూడు వందల మంది ఉండొచ్చు. ఇద్దరు పురుషుల మాత్రమే షర్ట్ లేకుండా ఉన్నారు. నాకేమీ అర్థం కావటం లేదు. షర్ట్ వేసుకుని ఉండటమే ఇక్కడి పద్ధతి అని అనిపిస్తోంది’ అని పోస్టు పెట్టాడు.

ఈ పోస్టుకు అనేక మంది భారతీయులు కూడా స్పందించారు. దుస్తులు పూర్తిగా ధరించడం ఇక్కడి సంప్రదాయమని అన్నారు. స్కిన్ షోను ప్రజలు సహించరని చెప్పుకొచ్చారు.


ఈ విషయమై మరో ఫారినర్ కూడా స్పందించారు. ఇండియా గురించి విదేశాల్లో చాలా తప్పుడు అభిప్రాయం ఉందని అన్నారు. ఇక్కడ చోరీలు ఎక్కువని జనాలు చెప్పుకున్నా వాస్తవం మాత్రం భిన్నమని అని తెలిపాడు. ఓసారి ఇండియాలో తన ఫోన్ పోతే ఎవరో కుర్రాడు దాన్ని తనకు అప్పగించాడని తెలిపారు. కానీ బ్రిటన్ ఎయిర్‌పోర్టులో ఉండగా తన బ్యాగ్ పోయిందని అన్నాడు. కాబట్టి, ప్రచారంలో ఉన్న విషయాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పాడు. తెల్లవాళ్లు చర్మం టాన్ కోసం బీచ్‌ల్లో దుస్తులు తొలగిస్తారని, భారతీయులకు ఆ సమస్య లేదని అన్నారు. ఇక వీడియో షేర్ చేసిన ఫారినర్ మాత్రం తన అలవాటు ప్రకారం, షర్ట్ తొలగించి సముద్రంలో సేదతీరాడు.

ఇవి కూడా చదవండి:

విదేశీ మహిళ ముందు పరువు పోగొట్టుకున్న భారతీయ పురుషులు.. వైరల్ వీడియో

ప్రస్తుతం భూమి చుట్టూ ఎన్ని శాటిలైట్‌లు తిరుగుతున్నాయో తెలుసా?

Read Latest and Viral News

Updated Date - Jun 01 , 2025 | 07:41 AM