ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ ఏడాది కచ్చితంగా విజయం సాధించాలనుకుంటే ఇలా చేయండి!

ABN, Publish Date - Jan 30 , 2025 | 08:22 PM

ఉదయాన్నే నిద్ర లేచేందుకు ఇబ్బంది పడుతున్నారా? ఇలాంటి వారి కోసం తన వద్ద 5 సెకెన్ల ట్రిక్ ఒకటి ఉందని అంటోంది ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె షేర్ చేసిన ట్రిక్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఉదయాన్నే లేస్తే ఎన్ని ఉపయోగాలో అందరికీ తెలిసిందే. అయితే, ఉదయం ఎలా లేవాలన్నదే అనేక మందిని వేధించే ప్రశ్న. చాలా మంది అలారమ్ పెట్టుకుంటారు గానీ ఉదయాన్నే అది మోగిన వెంటనే సైలెంట్‌లో పెట్టి మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. ఇలా ఉదయాన్నే లేవాలనే ప్రయత్నంలోనే రోజులు, వారాలు నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. ఇలా సమయపాలనతో ఇబ్బంది పడేవారి కోసం తన వద్ద ఓ అద్భుత మంత్రం ఉందని ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చెబుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది (Viral).

Leopard Hunt Wild Dog: చిరుత పంజాదెబ్బకు అడవికు కుక్క ఖతం! ఒళ్లు గగుర్పొడిచే వీడియో!


ఈ ఏడాది లైఫ్‌లో విజయం సాధించాలనుకునే వారు తను చెప్పింది ఫాలోకావాలని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మెల్ రాబిన్స్ చెప్పుకొచ్చింది. ఆమె చెప్పేదాని ప్రకారం, ఉదయం లేవకుండా బెడ్‌పైనే ఉండిపోతే మెదడులోని క్రియాశీల రహిత భాగం మనసుపై నియంత్రణ సాధిస్తుందట. దీంతో, ఉత్సాహం తగ్గి రోజంగా నిస్తేజంగానే గడుపుతారట. ఇలా రోజులు గడిచిపోతాయట.

Skin Tightening Treatments: ముఖం, గొంతుపై ముడతలా? ఈ ట్రీట్‌మెంట్‌తో అద్భుత ఫలితాలు!

ఈ విష వలయం నుంచి బయటకు రావాలంటే తన 5 సెకెండ్ రూల్ ఫాలో కావాలని మెల్ సూచించింది. దీని ప్రకారం, ఉదయం అలారమ్ మోతకు మెళకువ రాగానే 5 అంకె నుంచి ఒకటి వరకూ వెనక్కు లెక్కించాలి. ఈ ఒక్క పనితో మెదడు క్రియాశీలకమై ఉత్తేజం మొదలవుతుందట.


పులి మూత్రాన్ని విక్రయిస్తున్న చైనా జంతు ప్రదర్శన శాల! ఎందుకో తెలిస్తే..

‘‘అలారమ్ శబ్దం వినబడగానే నిద్ర లేచి రోజును ప్రారంభించండి. బెడ్‌పైనే ఉండిపోకండి. బెడ్‌పైనే ముసుగుతన్ని పడుకుంటే మీరు మరింత నిస్తేజంగా మారతారు. మరి ఇలా టైంకు నిద్రలేవాలంటే ఏం చేయాలి.. అంటే నా 5 సెకెన్ల రూల్‌ను ఫాలో కండి. ఇది చాలా సింపుల్. ఈ టెక్నిక్ ఎందుకు పని చేస్తుందంటే.. నిద్ర లేవకుండా ఎక్కువ సేపు బెడ్‌పై ఉంటే అలాగే ఉండిపోతారు. ఇలా మెదడును యాక్టివ్ చేస్తే గొప్ప ప్రయోజనం ఉంటుంది’’ అని ఆమె చెప్పుకొచ్చింది.

UPI Transaction ID Special Characters: ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు బంద్!

Updated Date - Jan 30 , 2025 | 08:27 PM