Share News

UPI Transaction ID Special Characters: ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు బంద్!

ABN , Publish Date - Jan 28 , 2025 | 06:21 PM

ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న యూపీఐ ట్రాన్సా్క్షన్ ఐడీలను అనుమతించబోమని ఎన్‌పీసీఐ ఓ సర్క్యులర్‌లో పేర్కొంది. కేవలం ఆల్ఫాన్యూమరిక్ ఐడీలనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు యూపీఐ వ్యవస్థలోని భాగస్వాములు తగు మార్పులు చేసుకోవాలని సూచించింది.

UPI Transaction ID Special Characters: ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు బంద్!

ఇంటర్నెట్ డెస్క్: మీరూ నిత్యం యూపీఐ చెల్లింపులు జరుపుతుంటారా? కూరగాయల కొనుగోలు మొదలు ఎలక్ట్రానిక్ ఉపకరణాల వరకూ అన్నింటికీ యూపీఐ ఆధారిత యాప్స్‌తో చెల్లింపులు చేస్తారా? అయితే, మీకు యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ గురించి తెలిసే ఉంటుంది. ప్రతి లావాదేవీకి సంబంధించి ఈ ఐడీ ఆటోమేటిక్‌గా తయారవుతుంది. సాధారణంగా ఈ ఐడీలు ఆల్ఫాన్యూమరిక్ అంటే.. అంకెలు, అక్షరాలు మాత్రమే ఉండేలా జనరేట్ అవుతాయి. కొన్ని సందర్భా్ల్లో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న ఐడీలు కూడా ఉంటాయి (Business News).

Financial Plan For Family : 50:30:20 రూల్ పాటిస్తే.. మీ అప్పులు తీరి ధనవంతులవుతారు..


అయితే, ఈ ఐడీకి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం, ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న ఐడీలను యూపీఐ కేంద్ర సిస్టమ్ అనుమతించదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ యూపీఐ వ్యవస్థలోని భాగస్వాములందరినీ ఎన్‌పీసీఐ తాజాగా అలర్ట్ చేసింది. కేవలం ఆల్ఫా న్యూమరిక్ ఐడీలు ఉన్న ట్రాన్సక్షన్స్‌ను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఈ మేరకు జనవరి 9న ఓ సర్క్యులర్ జారీ చేసింది. యూపీఐకి సంబంధించి సాంకేతిక స్పెసిఫికేషన్స్‌కు అనుగూణంగా ఈ మార్పులు చేసినట్టు ఎన్‌పీసీఐ పేర్కొంది. కొద్ది మంది మినహా దాదాపుగా అందరూ భాగస్వాములు కొత్త నిబంధనలకు అనుగూణంగా మార్పులు చేసినట్టు కూడా ఎన్‌పీసీఐ పేర్కొంది (UPI Transaction ID Special Characters to be Declined).

Stock Markets: స్టాక్ మార్కెట్లో నిన్నటి నష్టాలకు బ్రేక్.. ఈరోజు మాత్రం..


ఇక తాజాగా డేటా ప్రకారం, గత డిసెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య రికార్డు స్థాయిలో 16.73 బిలియన్లకు చేరుకుంది. అంతకుముందు, నెలతో పోలిస్తే దాదాపు 8 శాతం మేర లావాదేవీల సంఖ్య పెరిగింది. ఇక విలువ పరంగా చూస్తే గత డిసెంబర్‌లో రూ.23.25 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.

కాగా, యూపీఐ మోసాలపై కూడా ఎన్‌పీసీఐ మరో ప్రకటనలో చేసింది. ఇటీవల కాలంలో జంప్డ్ డిపాజిట్ స్కామ్స్‌‌ ఎక్కువయ్యాయన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ తరహా స్కా్మ్‌లల్లో సైబర్ నేరగాళ్లు కొద్ది మొత్తంలో బాధితులకు డబ్బు బదిలీ చేసి ఆపై వారిని మాయచేసి అధిక మొత్తంలో డబ్బులు తమ అకౌంట్లల్లోకి బదిలీ చేయించుకుంటున్నారట. దీనిపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌పీసీఐ.. యూపీఐ యాప్ ఓపెన్ చేసినం మాత్రాన లావాదేవీకి అనుమతి లభించదని స్పష్టం చేసిది. యూజర్లు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తేనే ట్రాన్సాక్షన్ పూర్తవుతుందని స్పష్టం చేసింది. ఈ దశ దాటకుండా లావాదేవీ పూర్తయ్యే ప్రసక్తే లేదని భరోసా ఇచ్చింది.

Read Latest and Business News

Updated Date - Jan 28 , 2025 | 06:25 PM