Share News

Stock Markets: స్టాక్ మార్కెట్లో నిన్నటి నష్టాలకు బ్రేక్.. ఈరోజు మాత్రం..

ABN , Publish Date - Jan 28 , 2025 | 10:30 AM

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూల దిశలో కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్ సూచీలు పాజిటివ్ ధోరణుల్లో ఉండటం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Stock Markets: స్టాక్ మార్కెట్లో నిన్నటి నష్టాలకు బ్రేక్.. ఈరోజు మాత్రం..
Stock Market sensex nifty Gains

ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు (Stock Markets) మంగళవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు BSE సెన్సెక్స్ 437.50 పాయింట్లు పెరిగి 75,803.67 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 50 సూచీ 77.55 పాయింట్లు లేదా 0.34 శాతం పెరిగి 22,906.70 వద్ద ట్రేడైంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 699 పాయింట్లు పెరుగగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ మాత్రం 742 పాయింట్లు తగ్గింది. ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సంకేతాల మధ్య భారత స్టాక్ మార్కెట్లు బలమైన లాభాలను నమోదు చేశాయి. ఈ రోజు మార్కెట్‌లో ప్రధానంగా ప్రభుత్వ రంగ కంపెనీలు, బ్యాంక్ స్టాక్‌లు కీలక పాత్ర పోషించాయి.


టాప్ 5 స్టాక్స్

BSE సెన్సెక్స్‌లో 30 స్టాక్‌లలో 21 స్టాక్‌లు లాభపడినవిగా కనిపించాయి. అందులో యాక్సిస్ బ్యాంక్ (1.66% పెరిగింది), బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, HDFC బ్యాంక్ లాభాలను అందుకున్నాయి. కానీ సన్ ఫార్మా (2.16% తగ్గింది), మహీంద్రా & మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, NTPC నష్టాలను నమోదు చేశాయి. పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 2.04% పెరిగి అగ్రస్థానంలో నిలిచింది. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాల్టీ వంటి సూచీలు కూడా 1% వృద్ధిని నమోదు చేశాయి. ఐటి, మెటల్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు కూడా పాజిటివ్ జోన్లో ఉన్నాయి.


ఈ షేర్లపై దృష్టి

ఈరోజు BPCL, MPS, టెక్నోప్యాక్ పాలిమర్స్ షేర్లు ముఖ్యంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. వాటి గడువు తేదీ రేపు (జనవరి 29, 2025) ముగుస్తున్న నేపథ్యంలో, BPCL, MPS షేర్లు ఎక్స్-డివిడెండ్‌గా ట్రేడ్ కానుండగా, టెక్నోప్యాక్ పాలిమర్స్ ఎక్స్-బోనస్‌గా ట్రేడవుతాయి. 2024 అక్టోబర్ నుంచి నిఫ్టీ 50 సూచీ 11.6 శాతం పడిపోయింది. ఇది గడచిన 10 సంవత్సరాలలో ఇది రెండో అతిపెద్ద పతనం అని అంచనా వేయబడుతోంది. గతంలో 2015 - 2016లో నిఫ్టీ 21 శాతం పడిపోయింది. హెల్త్‌కేర్, ఫార్మా సూచీలు వరుసగా 1.50%, 1.45% పడిపోయాయి. FMCG సూచీ కూడా 0.36% తగ్గింది. ఆటో సూచీ కూడా స్వల్పంగా 0.02% తగ్గింది. ముఖ్యంగా నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 0.97% క్షీణించగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 0.07% పెరిగింది.


కీలక ఒప్పందాలు

ACME సోలార్ హోల్డింగ్స్ లిమిటెడ్, NHPC లిమిటెడ్‌తో 680 MW సామర్థ్యం గల ఫర్మ్ & డిస్పాచబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ (FDRE) ప్రాజెక్ట్‌పై విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA) పై సంతకం చేసింది. ఈ ప్రాజెక్ట్ గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో అభివృద్ధి చెందనుంది. ట్రాన్స్‌ఫార్మర్లు & రెక్టిఫైయర్లు (ఇండియా) పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదానీ ఎనర్జీ ఇతర సంస్థల నుంచి రూ.362 కోట్ల విలువైన ఆర్డర్‌లను పొందినట్లు తెలిపింది.


ఇవి కూడా చదవండి:

Four Day Work Week: వారానికి నాలుగు రోజులే పని.. ఉద్యోగుల సంతోషం

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి

Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 28 , 2025 | 12:32 PM