Skin Tightening Treatments: ముఖం, గొంతుపై ముడతలా? ఈ ట్రీట్‌మెంట్‌తో అద్భుత ఫలితాలు!
ABN , Publish Date - Jan 28 , 2025 | 10:04 PM
ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కిన్ టైటెనింగ్ ట్రీట్‌మెంట్స్‌తో ముఖంపై ముడతలు తొలగించుకోవడంతో పాటు పూర్తి యూత్‌ఫుల్ లుక్స్ సొంతం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ, అల్ట్రా సౌండ్, లేజర్ థెరపీ చికిత్సలు అన్ని శరీర తత్వాల వారికీ అనువైనవని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వయసు పెరిగే కొద్దీ చర్మం తన సహజ సౌందర్యం కోల్పోతుంది. గట్టిదనం, సాగే గుణం తగ్గి చర్మంపై ముడతలు ఏర్పడతాయి. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక స్కిన్ టైటెనింగ్ ట్రీట్‌మెంట్ ద్వారా చర్మం యవ్వన కళను సొంతం చేసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు (Health). ఇంజెక్షన్ల వంటి ఇన్‌వేజివ్ విధానాలు లేకుండానే ఈ ట్రీట్‌మెంట్స్‌తో చర్మానికి కొత్త కళ వస్తుందని పరిశీలకులు అంటున్నారు.
స్కిన్ టైటెనింగ్ ట్రీట్‌మెంట్‌తో చర్మం మృదువుగా, కాంతి వంతంగా మారుతుందని నిపుణులు చెప్పేమాట. ఈ చికిత్సలతో చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం గట్టిగా మారుతుంది. సాగే గుణం కూడా పెరిగి మృదువుగా కనిపిస్తుంది. ఈ ట్రీట్‌మెంట్ కారణంగా ముఖం, మెడ, దవడలపై ఉన్న చర్మం నూతన కళను సొంతం చేసుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా ముఖానికి ఓ యూత్‌ఫుల్ లుక్ వస్తుందట (Skin Tightening Treatments).
Fatty liver: అలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టు అనుమానించాలి
చర్మాన్ని పునరుజ్జీవనం చేసుకునేందుకు ప్రస్తుతం అనేక మంది స్కిన్ టైటెనింగ్ ట్రీట్‌మెంట్లవైపే మొగ్గు చూపుతున్నారట. సర్జరీ అవసరం లేకుండానే ఇదంతా సాధ్యమవుతుండటంతో ఈ చికిత్సల పాప్యులారిటీ పెరుగుతోంది. ఈ విధానాలన్నీ ముఖం, మెడ, చేతులపై అత్యధిక ప్రభావం చూపించడం మరో సానుకూల అంశం. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలని అనుకునేవారికి స్కిన్ ట్రీట్‌మెంట్స్ అత్యంత అనుకూలమైనవి.
Tooth pain: పంటి నొప్పితో బాధపడుతున్నారా? ఈ చిన్న ట్రిక్‌తో తక్షణ రిలీఫ్!
రేడియో ఫ్రీక్వెన్సీ, అల్ట్రా సౌండ్, లేజర్ థెరపీ చికిత్సల్లో అధునాతన సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఇవి విభిన్న శరీర తత్వాలు ఉన్న వారికి అనుకూలంగా మారాయి. ఈ ట్రీట్‌మెంట్స్‌తో ముఖం నిగారింపు సంతరించుకోవడమే కాకుండా వ్యక్తులు యూత్‌ఫుల్ లుక్స్ సంతరించుకుంటారని కూడా చెబుతున్నారు.
కాబట్టి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాలన్నా లేదా పూర్తిగా యూత్‌ఫుల్ లుక్స్ సొంతం చేసుకోవాలన్నా స్కిన్ టైటెనింగ్ చికిత్సలు మంచి ప్రభావశీలమైనవని నిపుణులు చెబుతున్నారు. తద్వారా మరింత కాన్ఫిడెన్స్‌గా, ఉత్సాహంగా ఉండొచ్చని చెబుతున్నారు.