Leopard Hunt Wild Dog: చిరుత పంజాదెబ్బకు అడవికు కుక్క ఖతం! ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
ABN , Publish Date - Jan 28 , 2025 | 04:02 PM
చిరుత పంజాకు బలైన ఓ అడవి కుక్క వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలను చూసి జనాలు షాకైపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సింహం, పులి, చీతా, చిరుత.. ఇలా పిల్లి జాతికి చెందిన ఏ జంతువైనా మాటు అడవి ఆడటంలో ఆరితేరుంటాయి. ఒక్కసారి తమ టార్గెట్‌గా ఏ జంతువునైనా ఎంచుకుంటే ఇక వాటికి చావు మూడినట్టే. అవకాశం కోసం ఓపిగ్గా ఎదరు చూడటం, అదను దొరకగానే ఒక్కసారిగా మీద పడి పీక నోట పట్టడం ఈ జీవాల ప్రధాన వ్యూహం. ఇందుకు తాజా ఉదాహరణగా నెట్టింట మరో వీడియో వైరల్‌గా మారింది. ఇందులో చిరుత అడవి కుక్కను బలితీసున్న తీరు జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే (Viral)..
దక్షిణాఫ్రికాలోని మాలా మాలా గేమ్ రిజర్వ్‌లో ఈ షాకింగ్ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, అడవి కుక్కల మంద ఓ జంతువును అడవిాడి తింటున్నాయి. మిగతావి తమకు దొరికిన మాంసం ముక్కలను నోట కరిచి వెళ్లిపోగా చివరగా ఓ కుక్క మాత్రం జంతు కళేబరం వద్దే మిగిలిపోయింది. తన మానాన తాను లోకం మరిచి తింటోంది. అటువైపుగా వస్తున్న ఓ చిరుత కన్ను దానిపై పడింది. వెంటనే కుక్కను టార్గెట్ చేయాలని నిర్ణయించుకుంది (Leopard Hunt Wilddog).
Costa Rica Drug Lord: భార్య చేసిన మిస్టేక్.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన క్రిమినల్ గ్యాంగ్ లీడర్!
ఆ పరిసరాల్లో గడ్డి గుబురుగా పెరిగి ఉండటంతో అందులో నక్కి కూర్చొంది. మెల్లగా అడవి కుక్కవైపు ఒక్కో అడుగూ వేసుకుంటూ దగ్గరకు రాసాగింది. కానీ ఆ శునకం మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. ఇంతలో మరో శునకం ఆసక్తి కొద్ది చిరుత దాక్కున్న గడ్డి వామువైపు దూసుకొచ్చింది. దీంతో, చిరుత చూపు రెండో కుక్కపై పడింది. అది తనవైపే దూసుకువస్తుండటంతో అవకాశం వదులుకోవద్దనుకున్న చిరుత అది తన సమీపానికి రాగానే ఒక్కసారిగా దూకి దాని పీక పట్టుకుంది.
Wells: బావులన్నీ వలయాకారంలోనే ఉంటాయి? ఇలా ఎందుకని డౌటొచ్చిందా?
చిరుత కుక్క గొంతు పట్టుకోగానే నొప్పి తట్టుకోలేక విలవిల్లాడింది. దాని పట్టు నుంచి విడిపించుకునేందుకు శతథా ప్రయత్నించింది. పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేసింది. అయినా, చిరుత నుంచి మాత్రం తప్పించుకోలేక పోయింది. ఈలోపు శునకం అరుపులు విన్న ఇతర కుక్కలు దాన్ని కాపాడేందుకు చిరుతపై దాడికి తెగబడ్డాయి. అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి దాన్ని కొరకడం ప్రారంభించాయి.దీంతో, చిరుత వెంటనే పారిపోయింది. కానీ, దాని నోట చిక్కిన కుక్క మాత్రం అప్పటికే మరణం అంచులకే చేరింది. తీవ్ర గాయం కావడంతో కాసేపు విలవిల్లాడి చివరకు ప్రాణాలు విడిచింది. గేమ్ రిజర్వ్‌కు సఫారీ కోసం వచ్చిన పర్యాటకులు ఈ దృశ్యాలను వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడంతో ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.