ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: భార్యను తలకిందులుగా వేలాడదీసిన భర్త.. కారణం ఏంటంటే..

ABN, Publish Date - May 17 , 2025 | 07:00 AM

Husband Hangs Wife Upside Down: ప్రతీ రోజు లాగే ఆ రోజు కూడా నితిన్ తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ పెట్టుకున్నాడు. భార్యను ఇంటి పైకి తీసుకెళ్లాడు. అక్కడినుంచి ఆమెను తలకిందులుగా వేలాడదీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Husband Hangs Wife Upside Down

భార్యాభర్తల బంధం అన్న తర్వాత కోపాల్, తాపాల్, అలకలు.. అప్పుడప్పుడు గొడవలు సహజం. అయితే, కొన్ని సార్లు భర్త కావచ్చు.. భార్య కావచ్చు.. హద్దులు మీరి ఎదుటి వ్యక్తిపై హింసలకు పాల్పడుతూ ఉంటారు. తాజాగా, ఓ భర్త మద్యం మత్తులో భార్యతో అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. భార్యతో గొడవ పడి ఆమెను మేడపైనుంచి తలకిందులుగా వేలాడదీశాడు. ఈ దారుణమైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..


ఉత్తర ప్రదేశ్, బరేలీకి చెందిన నితిన్ సింగ్, డాలీ భార్యా భర్తలు. వీరికి పెళ్లయి 12 సంవత్సరాలు అవుతోంది. నితిన్ సింగ్ మద్యానికి బానిస. ప్రతీ రోజు తాగి ఇంటికి వచ్చే వాడు. మద్యం మత్తులో భార్యతో గొడవపడేవాడు. ఆమెను బాగా కొట్టే వాడు. చిత్ర హింసలు కూడా పెట్టేవాడు. నితిన్ మే 13వ తేదీన కూడా బాగా తాగి ఇంటికి వచ్చాడు. డాలీతో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెద్దదయింది. ఈ నేపథ్యంలోనే నితిన్ విచక్షణ కోల్పోయాడు. భార్యను ఇంటి మేడ పైకి తీసుకెళ్లాడు. అక్కడినుంచి ఆమెను తలకిందులుగా వేలాడదీశాడు.


దాదాపు ఐదు నిమిషాల పాటు ఆమెను అలాగే ఉంచాడు. డాలీ భయంతో కేకలు వేయసాగింది. ఆ అరుపులు విన్న పొరిగింటి వాళ్లు పరుగున అక్కడికి వచ్చారు. అతి కష్టం మీద ఆమెను కిందకు దించారు. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం వెళ్లింది. నిందితుడు నితిన్‌తో పాటు అతడి తల్లి, సోదరుడు, సోదరుడి భార్యపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న జనం నితిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Gold And Silver Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

Variety Recipes: నోరూరించే రాగి రుచులు

Updated Date - May 17 , 2025 | 07:02 AM