Huge python Video: వామ్మో.. ఆ కుర్రాళ్లకు భయం లేదా.. భారీ కొండచిలువ పక్కనే ఉంటే..
ABN, Publish Date - Jul 14 , 2025 | 08:29 AM
కొండచిలువను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. భారీ కొండచిలువను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఇద్దరు కుర్రాళ్లు ఓ భారీ కొండచిలువను చూసి కూడా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటనే (Snakes) భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. ఇక, కొండచిలువను (Python) చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. భారీ కొండచిలువను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఇద్దరు కుర్రాళ్లు ఓ భారీ కొండచిలువను చూసి కూడా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
@AMAZlNGNATURE అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను ఇండోనేసియా (Indonesia)లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ దృశ్యం చూడటానికి చాలా థ్రిల్లింగ్, భయానకంగా ఉంది. ఆ వీడియోలో ఇద్దరు పిల్లలు ఓ ఇంటి వరండాలో కూర్చుని ఉన్నారు. అక్కడకు ఓ భారీ కొండచిలువ మెల్లిగా వెళుతోంది. వారి పక్కకు వెళ్లింది. అది చూడడానికి చాలా పొడవుగా, భారీగా ఉంది. ఒక పిల్లాడు ఆ కొండచిలువ తలను పట్టుకుని ప్రేమగా నిమిరాడు. ఆ భారీ కొండచిలువకు ఆ పిల్లలు కొంచెం కూడా భయపడలేదు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 98 లక్షల మందికి పైగా వీక్షించారు. 46 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈ పిల్లలు దేనితో తయారు అయ్యారు అని ఒకరు ఆశ్చర్యకరంగా ప్రశ్నించారు. ఇంత పెద్ద కొండచిలువను పట్టుకోవడం జోక్ కాదని మరొకరు పేర్కొన్నారు. కాగా, ఇండోనేసియాలో కొండచిలువలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి..
మంచులో ఆగి ఉన్న కారు.. మూడు పులులు ఏం చేశాయో చూడండి.. వీడియో వైరల్
మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ కుక్కల మధ్యలో సీతాకోకచిలుకను 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 14 , 2025 | 09:08 AM