Tigers video: మంచులో ఆగి ఉన్న కారు.. మూడు పులులు ఏం చేశాయో చూడండి.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:26 PM
పులులు, సింహాలు వాటి నైజానికి భిన్నంగా ప్రవర్తించి చాలా మందికి షాకిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను ఓ మంచు ప్రాంతంలో చిత్రీకరించారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియా ద్వారా మన కళ్ల ముందుకు వచ్చే కొన్ని వీడియోలు కచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు (Wild Animals) సంబంధించిన వీడియోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. పులులు (Tigers), సింహాలు (Lions) వాటి నైజానికి భిన్నంగా ప్రవర్తించి చాలా మందికి షాకిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను ఓ మంచు ప్రాంతంలో చిత్రీకరించారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
@AMAZlNGNATURE అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియోను (Viral Video) షేర్ చేశారు. ఆ వీడియోను రష్యా (Russia)లోని మంచు ప్రాంతంలో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఎస్‌యూవీ కారును మంచుతో నిండిన ప్రాంతంలో ఆపి ఉంచారు. ఆ కారు విండో ఓపెన్ చేసి ఉండడంతో దానిలో నుంచి ఓ పులి లోపలికి ప్రవేశించింది. కొంత సమయం తర్వాత డ్రైవర్ వెనుక డోర్‌ను కూడా ఓపెన్ చేశాడు. దాంతో మరో రెండు పులులు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కారు ఎక్కేశాయి. మూడు పులులు కారులో కూర్చున్న తర్వాత అతడు కార్‌ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు.
చూస్తుంటే ఆ మూడు పులులు అతడి పెంపుడు పులుల్లా కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో చాలా మంది పులులు, సింహాలు వంటి క్రూర మృగాలను పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తను 83 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. లక్ష మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. రష్యాలోనే అలాంటి దృశ్యాలను చూడగలం అని ఒకరు కామెంట్ చేశారు. మూడు పులులను కారులో తీసుకెళ్లే ధైర్యం ప్రశంసనీయమని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మీ భార్య ఇబ్బంది పెడుతోందా, మీరు లవ్ ఫెయిల్యూరా.. ఆ టీ స్టాల్‌లో టీ మీకోమే మరి..
మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో భిన్నమైన టీ పాట్‌ను 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..