Share News

Tea stall offers: మీ భార్య ఇబ్బంది పెడుతోందా, మీరు లవ్‌ ఫెయిల్యూరా.. ఆ టీ స్టాల్‌లో టీ మీకోమే మరి..

ABN , Publish Date - Jul 12 , 2025 | 03:01 PM

గ్వాలియర్‌లోని ఓ టీ స్టాల్ ఓనర్ ప్రకటించిన ఆఫర్లకు సంబంధించిన సైన్ బోర్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ టీ యజమాని భార్యాబాధితులకు, ప్రేమలో మోసపోయిన వారికి చాలా గొప్ప ఆఫర్లు ఇస్తున్నాడు.

Tea stall offers: మీ భార్య ఇబ్బంది పెడుతోందా, మీరు లవ్‌ ఫెయిల్యూరా.. ఆ టీ స్టాల్‌లో టీ మీకోమే మరి..
Tea stall Offers

మన దేశంలో ప్రతి ఊరిలోనూ టీ స్టాల్స్ (Tea stalls) కనబడుతూ ఉంటాయి. రకరకాల ఫ్లేవర్ల టీలు దొరుకుతాయి. అయితే గ్వాలియర్‌లోని కలు బేవఫా చాయ్‌వాలా మాత్రం ప్రేమ, మోసం, ఒంటరితనం అనే మసాలాలను దట్టించి మరీ టీ (Tea)లు అమ్ముతున్నాడు. ఆ టీ స్టాల్ ఓనర్ ప్రకటించిన ఆఫర్లకు సంబంధించిన సైన్ బోర్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ టీ యజమాని భార్యాబాధితులకు, ప్రేమలో మోసపోయిన వారికి చాలా గొప్ప ఆఫర్లు ఇస్తున్నాడు (Tea stall Offers).


fake_smile అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆ టీ స్టాల్‌కు సంబంధించిన సైన్‌బోర్డ్‌ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ బోర్డులో ఆ యజమాని పలు ఆఫర్లు ప్రకటించాడు. అందులో ఉచిత టీ ఎవరికి అంటే.. భార్య వల్ల ఇబ్బందులు పడుతున్న భర్తలకట. భార్యాబాధితులు అక్కడికెళ్లి టీ తాగితే డబ్బులు చెల్లించనక్కర్లేదు. ఇక, ప్రేమలో మోసపోయిన వ్యక్తులకు కేవలం రూ.5కే టీ ఇస్తాడట. అలాగే ప్రేమ పక్షులు ఒక కప్పు టీ కోసం రూ.15 రూపాయలు చెల్లించాలట. ఇక, కొత్తగా ప్రేమలో పడిన వారికి రూ.10కే టీ ఇస్తాడట. అలాగే కోరుకున్న ప్రేమను పొందాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా రూ.49 రూపాయల ప్రీమియం టీ కూడా ఉందట.


ఆ ప్రీమియం టీలో లవ్ పౌడర్ కూడా కాస్త వేస్తాడట. ఇక, భాగస్వాములు లేక ఒంటరిగా గడిపే వారు టీ కోసం రూ.20 చెల్లించాలట. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌ను చాలా కొద్ది సమయంలోనే కోటి మందికి పైగా వీక్షించారు. 10 లక్షల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఆ టీ స్టాల్ యజమాని మార్కెటింగ్ విభాగంలో ఎమ్‌బీఏ చేసినట్టున్నాడని చాలా మంది కామెంట్లు చేశారు. కొందరు తమకు రూ.49 విలువైన ప్రీమియం టీ కావాలని కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

తిమింగలాలు ఒకప్పుడు భూమిపై నడిచేవా? ఈజిప్ట్‌లో బయటపడిన తిమింగళం భారీ అస్థిపంజరం..

మీ చూపు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 12 , 2025 | 03:01 PM