ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Python swallows man: మీరు భయస్తులైతే ఈ వీడియో చూడకండి.. కొండచిలువ పొట్ట కోసి చూస్తే..

ABN, Publish Date - Jul 06 , 2025 | 04:28 PM

ఒకసారి కొండచిలువకు చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. తాజాగా ఇండోనేసియాలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఇండోనేషియాలోని మజాపహిత్ గ్రామంలో జరిగిన ఓ ఘటనలో 63 ఏళ్ల వ్యక్తిని ఓ కొండచిలువ మింగేసింది.

Python swallows man

సాధారణంగా కొండచిలువలకు (Python) ఆకలి వేస్తే ఎంత పెద్ద జంతువునైనా, మనిషినైనా అమాంతం మింగేస్తాయి. ఒకసారి కొండచిలువకు చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. తాజాగా ఇండోనేసియా (Indonesia)లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఇండోనేసియాలోని మజాపహిత్ గ్రామంలో జరిగిన ఓ ఘటనలో 63 ఏళ్ల వ్యక్తిని ఓ కొండచిలువ మింగేసింది. చివరకు స్థానికులకు దొరికిపోయింది (Python swallows man).

therealtarzann అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఇండోనేసియాలోని మజాపహిత్ గ్రామానికి చెందిన 63 ఏళ్ల రైతు ఎల్ లా గత శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు సమీప పొలాలు, తోటల్లో అతడి కోసం వెతికారు. వారికి ఒక చోట కదల్లేని స్థితిలో ఉన్న ఓ కొండచిలువ కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు ఆ కొండచిలువను చంపేశారు. దాని పొట్ట కోసి చూస్తే లోపల ఆ 63 ఏళ్ల రైతు అచేతనంగా కనిపించాడు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 25 లక్షల మంది వీక్షించారు. 2.7 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. వీడియో చాలా డిస్ట్రబింగ్‌గా ఉందని కొందరు కామెంట్ చేశారు. బలహీన మనస్కులు ఈ వీడియో చూడకూడదని చాలా మంది పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

ఏసీ కంపెనీలు భయపడాల్సిందే.. ఈ కూలర్ ముందు ఏసీలు కూడా పనికి రావట..


ఈ ఫోటోలో Nల మధ్యలో కొన్ని Mలు కూడా ఉన్నాయి.. ఎన్ని ఉన్నాయో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 06 , 2025 | 04:28 PM