ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Google Maps: గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మితే ఇలాగే జరుగుతుంది.. ఓ కుటుంబం పరిస్థితి ఏమైందంటే..

ABN, Publish Date - Jul 06 , 2025 | 08:24 PM

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా ఫాలో అయి తెలియని రహదారుల్లో ప్రయాణించిన ఓ కుటుంబం ప్రమాదం అంచు వరకు వెళ్లిపోయింది. త్రుటిలో ప్రాణాలను కాపాడుకుని బయటపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఒక దారుణ ఘటన జరిగింది.

Google Maps Misleads Family

ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ (Technology) మన జీవితాలను ఎంతో సులభతరం చేస్తోంది. అయితే ఆ డిజిటల్ సాధానాలపై అతిగా ఆధారపడితే, గుడ్డిగా నమ్మి ఫాలో అయిపోతే మాత్రం కష్టాలు తప్పవు. గూగుల్ మ్యాప్స్‌ (Google Maps)ను గుడ్డిగా ఫాలో అయి తెలియని రహదారుల్లో ప్రయాణించిన ఓ కుటుంబం ప్రమాదం అంచు వరకు వెళ్లిపోయింది. త్రుటిలో ప్రాణాలను కాపాడుకుని బయటపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని సోలన్ జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటన జరిగింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని నలగఢ్‌కు చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె పరీక్ష కోసం ఉనాకు కారులో ప్రయాణిస్తోంది. వారు ప్రధాన రహదారిలో ప్రయాణించడం మానేసి, గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో అయి దభౌతా వంతెన మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే రెండు సంవత్సరాల క్రితం వరదల సమయంలో ఆ వంతెన పాక్షికంగా కొట్టుకుపోయింది. ఆ విషయాన్ని గుర్తించని గూగుల్ మ్యాప్స్‌ ఆ కుటుంబానికి ఆ రహదారిని సూచించింది. దీంతో వారు కారులో ఆ నదిలోకి ప్రవేశించారు. వంతెన బాగా లేకపోవడంతో వారి కారు కొట్టుకుపోయింది.

వారి కారు ఆ నదిలో కొన్ని కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ స్థానికులు వారిని గమనించి కాపాడారు. ఆ కారులోని నలుగురిని రక్షించారు. కాగా, ఈ పంచాయతీ ప్రజలు ఆ వంతెన గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వంతెనను బాగు చేయాలని కోరుతున్నారు. ఇంతకు ముందు కూడా పలువురు గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించి ఆ వంతెన దగ్గర ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. త్వరగా ఆ వంతెనను బాగు చేయాలని, లేదా ఆ వంతెన స్థితిని తెలిపే సైన్ బోర్డ్‌లనైనా పెట్టాలని సూచించారు.

ఇవి కూడా చదవండి..

ఏసీ కంపెనీలు భయపడాల్సిందే.. ఈ కూలర్ ముందు ఏసీలు కూడా పనికి రావట..


ఈ ఫోటోలో Nల మధ్యలో కొన్ని Mలు కూడా ఉన్నాయి.. ఎన్ని ఉన్నాయో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 06 , 2025 | 09:12 PM