ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Black Alien: ఏలియన్‌గా మారటం కోసం చేతి వేళ్లు, నాలుక కోయించుకున్నాడు..

ABN, Publish Date - May 01 , 2025 | 02:52 PM

Black Alien: చేతి వేళ్లు నరికించుకున్నాడు. మనుషులు ఆలోచించడానికి కూడా భయపడే పనులు చేశాడు.. చేస్తూనే ఉన్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ లెఫ్రెడో తనను రూపాన్ని ఏలియన్‌లాగా మార్చాలని అనుకున్నాడు. కొన్నేళ్ల నుంచి సర్జరీలు చేయించుకుంటూ ఉన్నాడు.

Black Alien

జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అని .. మనిషికి మనిషికి మధ్య ఆలోచనలు.. వారి ఆహారపు అలవాట్లు వేరు వేరుగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. కొంతమందిని చూస్తే వారికి పిచ్చేమైనా పట్టిందా అన్నట్లు వారి ప్రవర్తన ఉంటుంది. సాధారణ జనం ఆలోచనలకు.. వారి ఆలోచనలకు తేడా ఉంటుంది. తాము మిగిలిన వాళ్లకంటే ప్రత్యేకం అని నిరూపించుకోవటానికి.. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవటానికి ఎంతటి దారుణానికైనా తెగబడతారు. తమను తాము కష్టపెట్టుకుంటారు. ఫ్రాన్స్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఏలియన్‌గా మారడానికి తనను బాధించుకుంటున్నాడు.


నాలుకను కోయించుకున్నాడు. చేతి వేళ్లు నరికించుకున్నాడు. మనుషులు ఆలోచించడానికి కూడా భయపడే పనులు చేశాడు.. చేస్తూనే ఉన్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ లెఫ్రెడో తనను రూపాన్ని బ్లాక్ ఏలియన్‌లాగా మార్చాలని అనుకున్నాడు. కొన్నేళ్ల నుంచి సర్జరీలు చేయించుకుంటూ ఉన్నాడు. నాలుకను రెండుగా కోయించుకున్నాడు. రెండు చెవులు.. రెండు చేతులకు ఉన్న చిటికెన వేలు, దాని పక్కన వేలును తీసేయించుకున్నాడు. లెక్కలేనన్ని సర్జరీలు చేయించుకున్నాడు. శరీరంలో ప్రమాదకరమైన వస్తువుల్ని అమర్చుకున్నాడు. శరీరం మొత్తం నల్లటి రంగును ట్యాటూ వేయించుకున్నాడు.


అతడ్ని చూస్తే.. చిన్న పిల్లలే కాదు.. పెద్ద వాళ్లు కూడా భయపడి చావాల్సిందే. ఆంథోనీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలు పెట్టాడు. ఇప్పటి వరకు తాను 66 శాతం నల్ల ఏలియన్‌లా మారినట్లు చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో ఆంథోనీ ఏలియన్ లుక్ ఫోటోలు వైరల్‌గా మారాయి. కొంతమంది ఆంథోనీని పొగుడుతూ ఉంటే.. మరికొంతమంది తిడుతూ ఉన్నారు. ఆ ఫొటోలు కొంచెం అభ్యంతర కరంగా ఉండటంతో ఇన్‌స్టా వాటిని చూసే వారికి ఏజ్ లిమిట్ పెట్టింది. మొత్తానికి ఆంథోనీ తన ప్రాణాలను రిస్క్‌లో పడేసుకుంటున్నాడు. అతడు ఆరోగ్యంగా ఎంత కాలం బతుకుతాడో కూడా తెలీదు.


ఇవి కూడా చదవండి

Supreme Court: పహల్గాం దాడి విచారణ పిల్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Pakistans Fear of India: భారత్ అంటే పాక్‌కు భయం.. అమెరికా నిఘా సంస్థ సీఐఏ డాక్యుమెంట్‌లో కీలక విషయాలు

Updated Date - May 01 , 2025 | 03:00 PM