ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Men Littering: విదేశీ మహిళ ముందు పరువు పోగొట్టుకున్న భారతీయ పురుషులు.. వైరల్ వీడియో

ABN, Publish Date - May 29 , 2025 | 02:27 PM

ఫుట్‌పాత్‌పై చెత్త విసిరేస్తున్న కొందరు భారతీయ పురుషులను ఓ విదేశీ మహిళ నలుగురిలో నిలబెట్టి దుమ్ముదులిపి పారేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

India littering debate

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు పౌర స్పృహ తక్కువన్న విమర్శ గురించి తెలిసిందే. తాజాగా ఈ తీరుపై ఓ విదేశీ మహిళ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అమీనా అనే మహిళ ఈ పోస్టును షేర్ చేసింది. ఓ వ్యక్తి తన వద్ద ఉన్న చెత్తను ఎక్కడ పడితే అక్కడ విసిరేయడాన్ని చూసి ఆమె సహించలేకపోయింది. అతడిని నలుగురిలో నిలబెట్టి దులిపి పారేసింది. కింద పడేసిన చెత్తను తీసి చెత్త బుట్టలో వేయాలని వార్నింగ్ ఇచ్చింది. ‘పరిసరాలను పాడు చేస్తున్నందుకు వారిని నిలదీశా’ అని కామెంట్ కూడా పెట్టింది.

‘అది నీ పేపరా అని తొలుత నిలదీశా. అతను అవును అని అన్నాడు. నాకు కోపం వచ్చింది. ఆ చెత్తను తీసి చెత్తబుట్టలో వెయ్యి అని తేల్చి చెప్పా’ అని ఆమె పేర్కొంది. వేస్ట్ బిన్ పక్కనే ఉన్నా కూడా పట్టించుకోకుండా జనాలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ విసిరేయడంపై ఆమె తీవ్ర నిర్వేదం వ్యక్తం చేసింది.


ఇక ఈ వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. తప్పుగా ప్రవర్తించేవారిని నలుగురిలో నిలదీయడం సబబేనని అన్నారు. ‘నీ లాంటి వాళ్లు ఓ పది లక్షల మంది దేశంలో ఉంటే సమస్యకు చిటికెలో పరిష్కారం లభిస్తుంది’ అని ఓ వ్యక్తి అన్నాడు. మరికొందరు మాత్రం సదరు వ్యక్తులపై దుమ్మెత్తిపోశారు. బయటి వాళ్లతో కూడా చెప్పించుకోవడానికి కాస్త అయినా అవమానంగా ఎందుకు భావించరు అని ప్రశ్నించారు. జనాలకు సివిక్ సెన్స్ పెరగనంత వరకూ దేశం పరిస్థితి ఇలాగే ఉంటుందని మరికొందరు విచారం వ్యక్తం చేశారు.


ఇటీవల వైరల్ అయిన మరో ఘటన విషయంలో కూడా జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచుతో కప్పి ఉన్న ఓ కొండ ప్రాంతంపై గుట్కా ఉమ్మి మరకలు, గుట్కా ప్యాకెట్లు, స్నాక్స్ కవర్లు ఉన్న చిత్రాలు చూసి జనాలు షాకయ్యారు. ‘అంత ఎత్తున్న కొండపై పట్టుమని కనీసం 100 మంది టూరిస్టులు కూడా లేరు. అయినా ఆ ప్రాంతమంతా గుట్కా మరకలు కనిపించాయి. పరిసరాలను చెత్త చేయకూడదన్న స్పృహ భారతీయుల్లో ఎందుకు కనిపించదూ’ అంటూ ఆ ఫొటోలు షేర్ చేసిన వ్యక్తి విచారం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

క్యాబ్ బుక్ చేసిన యువతి.. కారు డ్రైవర్‌గా తన బాస్ రావడంతో..

సెలవు కోసం మేనేజర్ కండీషన్ విని షాక్.. ఉద్యోగి రాజీనామా

Read Latest and Viral News

Updated Date - May 29 , 2025 | 02:54 PM