Viral Video: పేక మేడలా కూలిన భవంతి.. 7 సెకన్లలో అంతా అస్సాం..
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:45 PM
Viral Video: నది పక్కన ఉన్న నిర్మాణంలోని ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం 7 సెకన్లలోనే అది నదిలో కలిసిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏదైనా వస్తువు నాణ్యతగా లేదనుకోండి.. ‘చైనా ప్రాడెక్ట్‌లా ఉంది’ అంటాం. చైనా తయారు చేసే వస్తువులు అంత దారుణంగా ఉంటాయి మరి. అందుకే వాటికి షాపు వాడు గ్యారెంటీ, వారెంటీ ఏమీ ఇవ్వడు. షాపు దాటి వెళితే సంబంధం లేదంటాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. చైనా తయారు చేసే వస్తువులే కాదు.. పెద్ద పెద్ద బిల్డింగుల పరిస్థితి కూడా అలానే ఉంది. తాజాగా, చైనాలో ఓ ఐదు అంతస్తుల బిల్డింగ్ 7 సెకన్లలో పేక మేడలా కుప్పకూలిపోయింది. నదిలో కలిసిపోయింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులనుంచి చైనా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నదుల్ని తలపిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జూన్ 30వ తేదీనుంచి జులై 1వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా సౌత్ చైనా, షిన్‌చౌ పట్టణం దగ్గర ఉండే లెంగ్‌షియ్ నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో నది పొంగి పొర్లింది. 2005 తర్వాత ఇప్పుడే అంత తీవ్ర స్థాయిలో నది పొంగి పొర్లింది.
దీంతో నది పక్కన ఉన్న నిర్మాణంలోని ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం 7 సెకన్లలోనే అది నదిలో కలిసిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 42 సెకన్ల ఆ వీడియోలో భవనం పేక మేడలా నీటిలో పడిపోతున్న దృశ్యాలు ఉన్నాయి. ఇక, వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘చైనా వస్తువులే కాదు.. మేడలు కూడా దారుణంగా ఉన్నాయి’..‘అది ఏఐతో తయారు చేసిన వీడియోలా అనిపిస్తోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కేంద్రం సంచలన నిర్ణయం.. అలాంటి కంటెంట్ చేస్తే జైలుకే..
విమానంలో ధ్యానం తెచ్చిన గొడవ.. జైలుకు భారతీయు యువకుడు..
Updated Date - Jul 04 , 2025 | 03:22 PM