Share News

Frontier Airlines Brawl: విమానంలో ధ్యానం తెచ్చిన గొడవ.. జైలుకు భారతీయ యువకుడు..

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:36 AM

Frontier Airlines Brawl: తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వారు ఆగలేదు. విమాన సిబ్బంది రంగంలోకి దిగి వారిని ఆపాల్సి వచ్చింది. విమానం మియామి చేరుకోగానే పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Frontier Airlines Brawl: విమానంలో ధ్యానం తెచ్చిన గొడవ.. జైలుకు భారతీయ యువకుడు..
Frontier Airlines Brawl

విమానంలో ధ్యానం చేయటం ఓ భారతీయ యువకుడి కొంప ముంచింది. సదరు భారతీయ యువకుడికి తోటి ప్రయాణికుడికి మధ్య జరిగిన గొడవ పోలీస్ కేసు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే భారతీయ యువకుడు జైలు పాలయ్యాడు. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌కు చెందిన ఇషాన్ శర్మ అనే 21 ఏళ్ల యువకుడు జూన్ 30వ తేదీన ఫిలడెల్ఫియా నుంచి మియామికి విమానంలో వెళ్తున్నాడు.


విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ధ్యానం చేయటం మొదలెట్టాడు. అయితే, ఇషాన్ ముందు సీట్లో కూర్చున్న కియాను ఇవాన్స్‌కు ఇది నచ్చలేదు. వింతగా ప్రవర్తించాడు. దీంతో ఇషాన్‌కు కోపం వచ్చింది. కియాను వైపు కోపంగా చూడసాగాడు. కియాను కూడా అంతే కోపంగా ఇషాను వైపు చూడసాగాడు. దీంతో ఇషాన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే అతడి గొంతుపట్టుకుని దాడికి దిగాడు. ఆ తర్వాత ఇయాను కూడా ప్రతిదాడికి దిగాడు. ఇద్దరు సీట్ల మీదే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు.


తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వారు ఆగలేదు. విమాన సిబ్బంది రంగంలోకి దిగి వారిని ఆపాల్సి వచ్చింది. విమానం మియామి చేరుకోగానే పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించారు. ఇషాన్ తనపై దాడి చేశాడంటూ కియాను పోలీసులకు చెప్పాడు. ఎలాంటి కారణం లేకుండా తనను కొట్టాడని అన్నాడు. దీంతో పోలీసులు ఇషాన్‌ను అరెస్ట్ చేశారు. మంగళవారం అతడ్ని కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా ఇషాన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘నా క్లయింట్ ధ్యానం చేసే మతానికి చెందిన వాడు. సీట్లో కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అతడి ముందు సీట్లో ఉన్న ప్రయాణికుడికి ఇషాన్ ధ్యానం చేయటం నచ్చలేదు. అక్కడే గొడవ మొదలైంది’ అని అన్నాడు.


ఇవి కూడా చదవండి

చైనా మరో స్కెచ్.. సరిహద్దుల వద్ద మాన్‌స్టర్స్..

హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్.. దీపిక కంటే ముందు ఆ భారతీయ నటుడు

Updated Date - Jul 04 , 2025 | 02:41 PM