Anaconda Video: ఏం గుండెరా అది.. భారీ అనకొండ తోక పట్టుకుంటే ఏం జరిగిందో చూడండి..
ABN, Publish Date - Jul 12 , 2025 | 06:51 PM
అమెజాన్ అడవుల మధ్య సరస్సుల్లో భారీ అనకొండలు బయటపడుతున్నాయి. వాటి ఆకారం చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది. తాజాగా ఓ జాలరి నదిలో చేపల వేటకు వెళ్లినప్పుడు అతడికి భారీ అనకొండ కనిపించింది. అయితే భయపడకుండా దాని తోక పట్టుకున్నాడు.
అమెజాన్ అడవుల (Amazon Forest) నుంచి భారీ అనకొండలకు (Anaconda) సంబంధించిన వీడియోలు పదే పదే బయటకు వస్తున్నాయి. అమెజాన్ అడవుల మధ్య సరస్సుల్లో భారీ అనకొండలు బయటపడుతున్నాయి. వాటి ఆకారం చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది. తాజాగా ఓ జాలరి (Fisher man) నదిలో చేపల వేటకు వెళ్లినప్పుడు అతడికి భారీ అనకొండ కనిపించింది. అయితే అతడు భయపడకుండా దాని తోక పట్టుకున్నాడు. ఆ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
@JustTerrifying అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Vieo) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ జాలరి తన పడవలో నిల్చుని భారీ అనకొండ తోక పట్టుకున్నాడు. ఆ సమయంలో ఆ భారీ అనకొండ ముందుకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తోంది. ఆ దాటికి ఆ పడవ ఊగిపోతోంది. అయినా ఆ వ్యక్తి మాత్రం ఆ అనకొండ తోకను వదల్లేదు. అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఆ అనకొండ తన శక్తినంతా ఉపయోగిస్తోంది. చివరకు జాలరి దానిని వదిలేయడంతో అది వేగంగా నది ఒడ్డుకు వెళ్లిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు మూడు లక్షల మందికి పైగా వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అతడు దానిని వదిలి ఉండకపోతే ఈపాటికి ప్రాణాలను కోల్పోయేవాడు అని ఒకరు కామెంట్ చేశారు. మనుషులు ఎక్కడున్నా ఇతర జీవులను ఇబ్బందులు పెడుతూనే ఉంటారని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇది నిజమైనా వీడియోనేనా? అని ఒకరు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
మీ భార్య ఇబ్బంది పెడుతోందా, మీరు లవ్ ఫెయిల్యూరా.. ఆ టీ స్టాల్‌లో టీ మీకోమే మరి..
మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో భిన్నమైన టీ పాట్‌ను 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 12 , 2025 | 06:51 PM