ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stag Beetle Price: ఈ పురుగు దొరికితే మీరు అదృష్టవంతులే.. క్షణాల్లో లక్షాధికారిగా అవ్వొచ్చు

ABN, Publish Date - Jul 11 , 2025 | 09:57 PM

స్టాగ్ బీటిల్ పురుగును అమ్మితే రెండు కార్లు కొనొచ్చంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి జనాలు షాకయిపోతున్నారు.

Stag Beetle

ఇంటర్నెట్ డెస్క్: ఈ భూమ్మీదున్న అనేక జీవాల్లో పురుగులు కూడా ఒకటి. ఇవి ఎన్ని జాతులున్నాయో కచ్చితంగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఇక కొన్ని కీటకాలు కరిస్తే ప్రాణాపాయం తప్పదు. మరి కొన్ని మాత్రం అదృష్టం తెచ్చి పెడతాయి. ముఖ్యంగా స్టాగ్ బీటిల్‌ అనే కీటకం మార్కెట్‌ ధర రూ.75 లక్షలకు పైనే ఉంటుంది. అందుకే దీనికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకంగా పేరు పడింది. అయితే, ఈ కీటకం తన కంట పడిందంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

తనకు సిక్కింలో ఈ కీటకం కనిపించిందని సదరు వ్యక్తి చెప్పుకొచ్చారు. ‘నేను సిక్కింలో ఉండగా ఈ స్టా్గ్ బీటిల్ పురుగు నా కంట పడింది. నేను ఇది సాధారణ బీటిల్ పురుగు అని భావించాను. ఎందుకైనా మంచిదని స్థానికుడు ఒకరిని ఇదేంటని అడిగాను. అతడు ఇది స్టాగ్ బీటిల్ అని వెంటనే బదులిచ్చారు. ఈ ఒక్క పురుగును అమ్మితే రెండు కార్లు కొనుగోలు చేయొచ్చు. ఇది నిజం. కావాలంటే మీరూ గూగుల్‌లో ఈ పురుగు ధర ఎంతో వెతకచ్చు’ అని పోస్టు పెట్టారు.

ఈ వీడియోకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వేల కొద్దీ లైకులు వచ్చాయి. అనేక మంది ఈ పురుగును చూసి ఆశ్చర్యపోయారు. ఈ కీటకం ఇంత ధర పలుకుతుందంటే నమ్మలేకుండా ఉన్నామని అన్నారు. కొందరు మాత్రం ఇది నిజమేనని అంగీకరించారు. ఇలా వివిధ రకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

స్టాగ్ బీటిల్‌ ఇంట్లో ఉంటే అకస్మాత్తుగా అదృష్టం కలిసి వస్తుందని అనేక సంస్కృతుల వారు నమ్ముతారు. దీంతో, ఈ కీటకానికి బాగా డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు ఇది అత్యంత అరుదుగా మాత్రమే కనిపించే పురుగు కావడంతో ధర ఎప్పుడూ లక్షల్లోనే ఉంటుంది. వీటి ధర రూ.75 లక్షలకు పైనే అని గూగుల్ సెర్చ్‌లో తెలుస్తుంది. ఈ పురుగును ఔషధాల తయారీలో కూడా వాడతారట. దీంతో ఈ పురుగుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

ఇవీ చదవండి:

ఈ పని మాత్రం అస్సలు చేయొద్దు.. హెచ్‌1బీ వీసాదారులకు నెటిజన్ సూచనపై పెద్ద చర్చ

మద్యం కోసం ఆరాటం.. ఇనుప చువ్వల మధ్య తల ఇరుక్కుపోవడంతో..

Read Latest and Viral News

Updated Date - Jul 11 , 2025 | 10:03 PM